తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ కాంబినేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – డైరెక్టర్ రాజమౌళి సినిమా ఒకటి. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అంతేగాక మహేష్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీయనున్నాడనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అలాగే రాజమౌళితో చేయనున్న సినిమాపై అభిమానులతో పాటు మహేష్ బాబు కూడా ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నాడు.
ఈ క్రమంలో రాజమౌళి తదుపరి సినిమాతో మహేష్ బాబును పాన్ ఇండియా హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇప్పటివరకూ మహేష్ పాన్ ఇండియా స్థాయిలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ.. పాన్ ఇండియా వైడ్ క్రేజ్, ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. అదీగాక ఎన్నో ఏళ్లుగా మహేష్ ని బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఆహ్వానించడం జరిగింది. అయినా మహేష్ తెలుగు ఫ్యాన్స్ కోసం, తెలుగు సినిమాలే చేస్తానని మొహమాటం లేకుండా చెప్పేశాడు.
సౌత్ ఇండియాలో హాలీవుడ్ పర్సనాలిటీ కలిగిన మహేష్ బాబు.. రాజమౌళితో సినిమా చేయడంపై ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడో.. మహేష్ రాజమౌళి ద్వారా పాన్ ఇండియా హీరో కాబోతుండటం పై అంతకుమించిన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే.. మహేష్ బాబు కోసం రాజమౌళి పర్ఫెక్ట్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడట. రాజమౌళి స్క్రిప్ట్ ఎంత పకడ్బంధీగా రెడీ చేస్తాడో.. సినిమాను కూడా అంతే బాగా తీర్చిదిద్దుతాడు. అందుకే తన ప్రతి సినిమాకు ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ పక్కా అనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక తాజా సినీవర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా రెండు సంవత్సరాల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు ఎప్పుడు కూడా ఏ సినిమాకు ఏడాదికి మించి టైం తీసుకోలేదు. కానీ రాజమౌళి మేకింగ్ గురించి తెలుసు కాబట్టి.. ఓ కండిషన్ పై అడిగినన్ని డేట్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయాడట. మహేష్ బాబు రెండేళ్ల సమయమంటే.. మినిమమ్ 2-3 సినిమాలతో సమానం. కనుక ఇచ్చిన రెండేళ్ల టైంలోనే సినిమా కంప్లీట్ అయిపోవాలనే కండిషన్ పై మహేష్ డేట్స్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. మరి మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా చేస్తాడో.. మహేష్ ని ఎలా చూపించనున్నాడో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.
Superstar #MaheshBabu to allocate two full years for Rajamouli film.
📽️🎬 2023
— Manobala Vijayabalan (@ManobalaV) June 11, 2022
ఇదిలా ఉండగా.. రాజమౌళి సినిమాకంటే ముందు మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో ఇది 28వ సినిమాగా రానుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను.. ఈ ఏడాదిలోనే ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు త్రివిక్రమ్. ఇక మహేష్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరి మహేష్ – రాజమౌళి కాంబినేషన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
It will be with Mahesh babu
It is an ACTION – ADVENTURE 💥– SS Rajamouli #SSMB29 @urstrulyMahesh
— UDAY #SSMB28 💥 (@UDAyVarma1882) April 9, 2022