బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మరో పెళ్ళికి సిద్దమయ్యాడా ?..అవును ఇప్పుడు ఇదే వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావులు తమ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. మేము ఇద్దరు ఓ సరికొత్త జీవితాన్ని మళ్లీ ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. బిడ్డను కూడా కలిసే చూసుకుంటామని సృష్టంగా తెలిపారు. ఇక ఇదంత బాగానే ఉన్నా.. తాజాగా మరో అంశంతో వార్తల్లోకి వచ్చాడు అమీర్ ఖాన్.
గత కొద్దీ రోజుల నుంచి అమీర్ ఖాన్ మరో పెళ్ళికి సిద్దమయ్యాడంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో అమీర్ ఖాన్ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ దంగల్ అనే సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్ళు ప్రేమలో మునిగి తేలుతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక దీని కారణంగానే భార్య కిరణ్ రావుకు అమీర్ ఖాన్ విడాకులకు మొగ్గుచూపాడని సమాచారం.
అమీర్ ఖాన్ కిరణ్ రావు కన్నా ముందే ఇంకో పెళ్లి చేసుకుని ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. ఇక ఈ వ్యవహారంపై చాల రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా..అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్ పెదవి విప్పకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే..అమీర్ ఖాన్ కూతురుకి ఈ పెళ్లికి సపోర్ట్ ఇస్తున్నట్లు సమాచారం. మరి వీళ్లు నిజంగానే పెళ్ళికి సిద్ధమయ్యారా అనేది ఇంకా తెలియాల్సిన అంశం. దీనికి మీ అభిప్రాయాలను కామెంట్ ల రూపంలో తెలియజేయండి.