భారత దేశంలో ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చినప్పటికీ.. బిగ్ బాస్ కీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాలీవుడ్ లో వచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు దేశంలో వివిధ భాషల్లో రన్ అవుతుంది. తెలుగు లో బిగ్ బాస్ షోకి మొదట ఎన్టీఆర్ హూస్ట్ చేయగా.. తర్వాత నాని హూస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున్ బిగ్ బాస్ కి హూస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 రన్ అవుతుంది. అన్ని భాషల్లో బిగ్ బాస్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకు పోతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో పదవ వారం ఎన్నో ట్విస్టులతో సాగింది. ఎవరూ ఊహించని విధంగా ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 6 లో అందరితో ఎంతో మర్యాదగా నడుచుకుంటూ.. సౌమ్యూడిగా పేరు తెచ్చుకున్న బాలాదిత్య శనివారం ఎలిమినేషన్ అయ్యాడు. సెకండ్ ఎలిమినేషన్ మెరినా ఉండొచ్చు అంటూ వార్తలు కూడా వచ్చాయి.. కానీ అందరికీ ట్విస్ట్ ఇస్తూ వాసంతి ఎలిమినేట్ అయ్యింది. మొదటి నుంచి వాసంతి తన అందంతో బిగ్ బాస్ హౌస్ కి మంచి కళ తీసుకు వచ్చింది.. ఈ విషయం అప్పుడప్పుడు నాగార్జున కూడా అంటూ ఉండేవారు. పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాసంతి.. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత కన్నడ మూవీల్లో నటించింది. తెలుగులో సంపూర్ణేష్ బాబు నటించిన క్యాలీఫ్లవర్, సునీల్ నటించిన వాంటెడ్ పండుగాడు చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేషన్ అయి బయటికి వచ్చిన వాసంతికి ఆమె ఫ్యాన్స్ గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ఈ సందర్భంగా తనను పది వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో కంటిన్యూ అయ్యేలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే తనకు అండగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా జై పవన్ కళ్యాన్ అంటూ నినాదం చేసింది. ఛాన్స్ వస్తే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు.. తప్పకుండా చేస్తాను. అవకాశం వస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపింది వాసంతి. పవన్ కళ్యాణ్ మూవీలో నటించే ఛాన్స్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు సంతోషంగా నటిస్తాను.. కానీ చాన్స్ రావాలి కదా అంటూ సమాధానం ఇచ్చింది. ఏది ఏమైనా పవన్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ కృతజ్ఞతలు.. వారికి జీవితాంతం రుణపడి ఉంటా అన్నారు వాసంతి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.