తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ సరికొత్త షో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నటసింహం బాలయ్యను హోస్ట్‌గా ‘అన్‌స్టాపబుల్’ పేరుతో షోను ప్రసారం చేయనుంది ఆహా. మొదటి ఎపిసోడ్లో ఎవరొస్తారా అనే ఉత్కంఠకు తెరదించుతూ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. కలక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటి అతిథిగా షోలో పాల్గొన్నారు. ఓపెనింగ్ డైలాగే మోహన్ బాబుపై సెటైర్‌తో స్టార్ట్ చేశాడు బాలయ్య.
షోలో ఎన్నో చిక్కు ప్రశ్నలు.. కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు సంధించాడు బాలకృష్ణ. అంతేకాదు మధ్యలో మంచు లక్ష్మి, విష్ణు కూడా ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తిగా మారింది. డాన్సులు, డైలాగులతో బాలయ్య బాబు హోరెత్తించారు. మోహన్ బాబుతో గేమ్స్ కూడా ఆడించాడు. మొత్తం మీద ఈ షో అసలు మజా ఆస్వాధించాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ప్రోమోతోనే షోమీద ఎన్నో అంచనాలు పెంచేశారు. తెలుగు అభిమానులకు మంచి షోను అందించిందనే భావన వచ్చింది. ముఖ్యంగా బాలయ్యను హోస్ట్‌గా చూడటమే మా అదృష్టం అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. మరి, ఆ మోస్ట్ అవెయిటెడ్ ప్రోమో మీరూ చూసేయండి.