నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపులో తెలుగు OTT ‘ఆహా’లో తాను హోస్టుగా నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోని కూడా బ్లాక్ బస్టర్ చేశాడు. అసలు బాలయ్య హోస్టింగ్ ఏంటని అనుమానించిన వారందరికి.. తాను సినిమాల్లోనే కాదు టాక్ షోలు కూడా అదరగొడతానని నిరూపించాడు.
ఇటీవలి కాలంలో తెలుగులో ప్రసారమైన టీవీ షోలు, ఓటిటి షోలన్నిటిలో ‘అన్ స్టాపబుల్’ షో నెంబర్ వన్ స్థానం(IMDB టాప్ 10లో స్థానం పొందటం)లో నిలవడం విశేషం. ఇంత సూపర్ హిట్ టాక్ షోతో ఆహాకి ఎన్నడూ చూడని లాభాలు క్యూ కట్టాయని, అలాగే సబ్ స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక బాలయ్య ఈ టాక్ షో మొదటి సీజన్(10 ఎపిసోడ్లు)కి 2.5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. ఆహాలో ‘అన్ స్టాపబుల్’ బాలయ్య విజయం వెనుక అసలు కారణం.. ఆయన చిన్న కూతురు తేజస్విని అని ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది. 2013లో తేజస్విని, ప్రముఖ విద్యావేత్త ఎంవివిఎస్ మూర్తి మనవడు భరత్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు.
పెళ్లి తర్వాత ఇంతకాలం వినిపించని తేజస్విని పేరు తాజాగా ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా తెరమీదకి వచ్చింది. ఎందుకంటే.. బాలయ్య టాక్ షోకి తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తుందని సమాచారం. ఆమె క్రియేటివిటీ వల్లే బాలయ్య హోస్టింగ్ అదరగొడుతున్నాడని, కెమెరా వెనకే ఉంటూ తండ్రి విజయానికి కారణమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి బాలయ్య కూతురు సపోర్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.