గత కొన్నేళ్ల నుంచి నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉందని, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మోక్షజ్ఞ ఎంట్రి ఇచ్చే సినిమాకు దర్శకత్వం వహించనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి షికారులు చేశాయి. ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై గతంలో మీడియాలో చర్చలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు స్పందించి ఓ క్లారిటీ మాత్రం ఇచ్చారు.
తాజాగా గోవాలో ఫిలిం ఫెస్టివల్ పాల్గొన్న బాలకృష్ణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగంలోకి ప్రవేశం త్వరలోనే జరగనుందని తెలిపాడు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ ఓ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్నాడని తెలిపారు. ఇక ఇంతటితో ఆగకుండా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలపై కూడా స్పందించి సందించనట్లుగా… అంత దైవేచ్ఛ అంటూ తనలో తాను నవ్వుకున్నాడు. ఇక ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు.అయితే మోక్షజ్ఞ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఎంటీ ఇస్తాడా లేక మరో దర్శకుడితో వస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఇదే కాకుండా బాలకృష్ణ మరో ఇంట్రెస్టింగ్ వార్తను కూడా అభిమానులకు తెలియజేశాడు. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మూవీ అఖండ. ఈ మూవీ విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ త్వరలో అఖండ 2 మూవీ కూడా రానుందని తెలియజేయడం విశేషం. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ మూవీలోని ఓ ఓ మాస్ సాంగ్ ను చిత్ర యూనిటల్ ఇటీవల రిజీల్ చేసింది.ఇక విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.