Bahubali 2: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మార్కెట్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. వందల కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా మేకింగ్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదివరకు గ్రాఫిక్స్ తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకునేవారు. ఇప్పుడు సినీ మార్కెట్ దేశవ్యాప్తంగా విస్తరించేసరికి ఎన్ని కోట్లు ఖర్చయినా పర్లేదంటూ.. గ్రాఫికల్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. కావాల్సినంత టైం తీసుకొని సినిమాలను తెరమీదకు తీసుకొస్తున్నారు.
ఆ విధంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో బాహుబలి సిరీస్ ఒకటి. ఇండియన్ సినీ చరిత్రలో కలెక్షన్స్ పరంగా ఎన్నటికీ చెరగని రికార్డులు సెట్ చేసింది బాహుబలి 2. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. కేవలం ఇండియాలోనే 1400 కోట్లకు పైగా వసూల్ చేసి, మొత్తంగా 1800 కోట్లకు పైగా రాబట్టి టాప్ లో నిలిచింది. అయితే.. రాజమౌళి సృష్టించిన మాహిష్మతీ సామ్రాజ్యంలోకి అందరినీ తీసుకెళ్లగలిగింది టెక్నికల్ టీమ్. మరి ప్రేక్షకులు అన్ని మరిచిపోయి సినిమాలో లీనమైపోవడానికి మెయిన్ రీజన్ విజువల్స్.
బాహుబలి సినిమా విడుదలయ్యాక కొన్నేళ్లపాటు ఆ సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకున్నారు. అంటే.. ఆ స్థాయిలో బాహుబలి విజువల్స్ ప్రేక్షకులను, వేరే ఇండస్ట్రీలకు చెందిన మేకర్స్ ని ఆకట్టుకున్నాయి.. అలాగే ఇన్స్పైర్ చేశాయి. ఆ తర్వాత బాహుబలి మేకింగ్, తెరవెనుక చేసిన హార్డ్ వర్క్ కి సంబంధించి వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలు ఎంతో వైరల్ అయ్యాయి కూడా.. ఇప్పుడు బాహుబలి మేకింగ్ కి సంబంధించి మరో కొత్త వీడియో హాట్ టాపిక్ గా మారింది.
కుంతల రాజ్యంలో కోటపై జరిగే ఫైట్ లో ప్రభాస్.. ఎద్దుల గుంపులో పరిగెడుతూ.. మధ్యలో ఎద్దులపై ఎక్కి దూకుతాడు. ఆ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియోలో.. అసలు ఎద్దులు కనిపించకపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ వీడియోలో ప్రభాస్ నడుముకు తాడు కట్టి పైకి లాగడాన్ని మనం గమనించవచ్చు. ఇదే వీడియో సినిమాలో చూస్తే.. ప్రభాస్ పరిగెడుతున్న ఎద్దుల గుంపుపై సాహసాలు చేస్తాడు. ప్రస్తుతం ప్రభాస్ ఫైట్ సీన్, పంట పొలాల్లో అడవి పందులను చంపే సీన్స్ మేకింగ్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.