అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్(31) సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతను హయత్ నగర్ కుంట్లూర్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసముండేవాడు. ఈ నెల 14న తన ద్విచక్రవాహనం (ఏపీ 29 బీసీ 0439)పై బయటకు వెళ్లిన కార్తీక్ రెండ్రోజుల తర్వాత హయత్ నగర్ పీఎస్ పరిధిలో శవంగా కనిపించాడు. 14న రాత్రి 9 గంటలకు సోదరుడితో ఫోన్ మాట్లాడిన కార్తీక్ నుంచి తర్వాత ఎలాంటి సమాచారం లేదు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: భర్తను వదిలి డబ్బు కోసం భార్య దారుణం! అనాథ అయిన 4 ఏళ్ళ కొడుకు!
కంప్లైంట్ తీసుకున్న హయత్‌నగర్ పోలీసులు కార్తీక్ కోసం వెతకడం ప్రారంభించారు. రెండ్రోజుల తర్వాత గౌరెల్లి సమీపంలోని సీఎన్‌ఆర్ క్రికెట్ అకాడమీ వద్ద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అనుమానం వచ్చిన పోలీసులు కార్తీక్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న కుటుంబసభ్యులు అది కార్తీక్ మృతదేహం అని నిర్ధారించారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్చారు. అయితే కార్తీక్ ది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.