సినీ ఇండస్ట్రీలో నటీనటుల జీవితాలు ఎప్పుడు వెలుగుతాయో.. ఎప్పుడు చీకటిమయం అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్డమ్ ని చూసినవారు.. ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా దీనస్థితిలో తారసపడుతున్నారు. ఎప్పుడో సినిమాలు వదిలేసినప్పటికీ, ఇన్నాళ్లు ఏమైపోయారు అనేది ఎవరికీ తెలియదు. సినిమాలు మానేశాక లేదా అవకాశాలు ఆగిపోయాక ఏం చేశారో.. లైఫ్ ని ఎలా లీడ్ చేశారో అనే సందేహాలు వారిని చూడగానే అనిపిస్తాయి. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు.. ప్రేక్షకులను ఎంతో కలచి వేస్తాయి.
ఇటీవల చాలామంది సీనియర్ నటులను దీనస్థితిలో చూశాం. అదే వరుసలో ఇప్పుడు మరో నటి దీనగాథ అందరినీ కదిలిస్తోంది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి.. గురించి 1980-90 ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్స్ పోషించిన పాకీజా.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోందంటే మీరు నమ్ముతారా? కానీ.. వాస్తవం అదే. అవును.. నటి పాకీజా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ.. చేసిన సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని తనకంటూ ఏమి లేకుండా చేసుకుంది.
తెలుగులో అసెంబ్లీ రౌడీ మూవీలో వేసిన పాకీజా రోల్ ద్వారా ఆమె పేరు తెలుగులో అలాగే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా సినిమాలలో నటించిన పాకీజా.. అందరి స్టార్స్ సినిమాలు చేసి తెలుగులోనే దాదాపు 50 సినిమాలు చేసిందట. ప్రస్తుతం ఈమె పరిస్థితి దారుణంగా మారిపోయిందట. రీసెంట్ గా ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న పాకీజా.. తన లైఫ్ లో జరిగిన విశేషాలను, తనకు ఇంతటి దుస్థితి రావడానికి కారణాలు కెమెరా ముందు షేర్ చేసుకుంది. పాకీజా లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ, ఆస్తిపాస్తులు మాత్రం ఏమి వెనకేసుకోలేదట.
ప్రస్తుతం పాకీజాకి సంబంధించి తాజా ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా పాకీజా మాట్లాడుతూ.. తెలుగులో 50 సినిమాలు చేశాను. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అప్పట్లో స్టార్స్ అందరి సినిమాలు చేశాను. సినిమాలు ఆపేశాక నా సొంతవూరు కారైకుడికి వెళ్ళిపోయా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ అంటే జయలలిత. కొన్నాళ్లుగా ఆర్థిక పరిస్థితి బాలేదు. 150 సినిమాలు చేసినా చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను. హెల్ప్ కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలను సంప్రదించాను. ఆఖరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కూడా నా పరిస్థితి వివరించాను. ఎవరూ హెల్ప్ చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ లో ఉంటూ జీవనం సాగిస్తున్నాను. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను’ అని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం నటి పాకీజా దీనస్థితిలో చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరి నటి పాకీజా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.