పాకీజా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె గత కొంతకాలంగా అవకశాలు లేక.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకీజా పరిస్థితి గురించి సుమన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ప్రయత్నం ఫలించి.. ఆమెకు అవకాశాలు అందుతున్నాయి. తాజాగా ఓ షోలో సందడి చేశారు పాకీజా. ఆ వివరాలు..
టాలీవుడ్ సీనియర్ నటి పాకీజా దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు చెరో లక్ష రూపాయాలు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాకీజాకు చేయూత అందించాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
90స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరొందిన పాకీజా గురించి ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిందనే మాటలు ఆమె నోట వింటుంటే ఖచ్చితంగా ఎవరి కంట్లో అయినా కన్నీళ్లు తిరుగుతాయి.
మెగాస్టార్, అన్నయ్య, అందరివాడు ఇలాంటి ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఆయనకు తక్కువనే చెప్పాలి. ఇండస్ట్రీ పెద్దరికాన్ని నేను తీసుకోను.. కానీ, అవసరం వచ్చినప్పుడు మాత్రం కొమ్ముకాస్తాను అనే మాటలను మెగాస్టార్ చేతల్లో చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ విషయాన్ని చేసిచూపించారు కూడా. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపదలో ఉన్నామంటూ ఎవరు ఆయన ఇంటి తలుపు తట్టినా కాదనకుండా సాయం చేస్తారు. తాజాగా ఆయన దానగుణం, సేవా తత్పరతను మరోసారి నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నానంటూ […]
అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పాత్రలో తెలుగు ప్రేక్షకులను వాసుకీ మెప్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్క్రీన్ నేమ్ కూడా పాకీజాగానే చలామణి అయ్యింది. వాసుకీ అనే కంటే కూడా పాకీజా అంటేనే ఎక్కువ మంది గుర్తిస్తారు. అటు తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఒక వెలుగు వెలిగిన తార ఆవిడ. కానీ, ఇప్పుడు అత్యంత దైనీయ పరిస్థితిలో ఉన్నారు. తాజాగా సుమన్ టీవీ ఆవిడను ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసిన […]
సినీ ఇండస్ట్రీలో నటీనటుల జీవితాలు ఎప్పుడు వెలుగుతాయో.. ఎప్పుడు చీకటిమయం అవుతాయో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్డమ్ ని చూసినవారు.. ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా దీనస్థితిలో తారసపడుతున్నారు. ఎప్పుడో సినిమాలు వదిలేసినప్పటికీ, ఇన్నాళ్లు ఏమైపోయారు అనేది ఎవరికీ తెలియదు. సినిమాలు మానేశాక లేదా అవకాశాలు ఆగిపోయాక ఏం చేశారో.. లైఫ్ ని ఎలా లీడ్ చేశారో అనే సందేహాలు వారిని చూడగానే అనిపిస్తాయి. కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వందల సినిమాలు చేసి, చివరికి తిండిలేక […]