మన సమాజంలో మహిళల మీద ఆంక్షలు ఎక్కువ. వారు ఎలా ఉండాలి.. ఏం తినాలి.. ఏం ధరించాలి వంటి విషయాలని సమాజమే నిర్ణయిస్తుంది. వాటిని ఆచరించాలి. లేదంటే అమ్మో బరితెగించింది అంటారు. అదే మగాళ్ల విషయంలో ఇవేమి ఉండవు. మరీ ముఖ్యంగా ఆడవారి వస్త్రధారణ విషయంలో ఎన్నో ఆంక్షలు.. పాటించకపోతే ఏదో పెద్ద నేరం చేసినట్లు చూస్తారు. ఏ మనిషి అయినా సరే తమకు సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తారు.. ధరించాలి. కానీ ఆడవారి విషయానికి వస్తే ఈ విషయంలో ఎన్నో అభ్యంతరాలు. ఆఖరికి లో దుస్తుల విషయంలో కూడా ఇలానే కామెంట్స్ చేస్తారు. కానీ శరీరాన్ని బిగుతుగా పట్టి ఉంచే లోదుస్తల వల్ల ఎంతటి ఇబ్బంది కలుగుతుందో.. అవి ధరించే వారికే మాత్రమే తెలుసు. ఈ క్రమంలో పలు దేశాల్లో నో బ్రా ఊద్యమం కూడా ఊపందుకుంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో సోదరి ఒకరు ఈ ఉద్యమంలో చేరారు. ఆమె ఏకంగా కెమరా ముందే బ్రా తీసేసి.. అందరిని షాక్ గురి చేసింది. ఆ వివరాలు..
అన్షులా కపూర్.. ఈమె గురించి సామాన్యులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్‌లో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కపూర్‌ల ఖాందన్‌కి చెందిన వ్యక్తి. బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె.. అర్జున్ కపూర్‌కి సొంత సోదరి. అయితే ఇంత పెద్ద కుటుంబానికి చెందినప్పటికి.. ఆమె ఎక్కువగా లైమ్‌లైట్‌లో కనిపించదు. మీడియా ముందుకు పెద్దగా రాదు. గతంలో శ్రీదేవి మరణించిన సమయంలో ఆమె కుమార్తెలకు మద్దతుగా నిలిచి.. అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి.. నెలల పాటు శ్రమించి బరువు తగ్గి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ రెండు సందర్భాల్లో నెటిజనులు అన్షులాపై ప్రశంసలు కురిపించారు. కానీ తాజాగా ఆమె చేసిన పనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అన్షులా.. తాజాగా వదిలిన ఓ వీడియోతో వామ్మో ఈమె మరీ ఇంత బోల్డా అని అందరు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక ఈ తాజా వీడియోలో అన్షులా కెమరా ఉందే.. తన వన్ పీస్ డ్రెస్ లోపలి నుంచి బ్రా తీసేసి అందరికి షాక్ ఇచ్చింది. అంతేకాక క్యాప్షన్‌తో మరింత మంట పెట్టింది. ఇప్పుడు ఎంతో హాయిగా ఉంది అంటూ వీడియోని పోస్ట్ చేసింది. ఇక ఇది చూసిన నెటిజనులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు మహిళలు.. అవును బ్రా తీసేసిన తర్వాత చాలా రిలీఫ్‌గా ఉంటుంది అంటూ అన్షులాకు మద్దతు తెలుపుతున్నారు. కానీ మరికొందరు మాత్రం.. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి ఇక్కడ కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్స్ అన్షులాను విమర్శిస్తున్నారు. నువ్వు కూడా ఇలాంటివి చేయడం ప్రారంభించేశావా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vishal injured: సినిమా షూటింగ్‌లో ప్రమాదం! మరోసారి తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్
మరికొందరు అర్జున్ కపూర్ సోదరి.. ఇప్పుడు మలైక అరోరా అడుగుల్లో నడుస్తుంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. బాలీవుడ్ హీరో అయిన అర్జున్ కపూర్ గత కొన్నాళ్లుగా మలైకతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అన్షులా నో బ్రా వీడియో చూసిన తర్వాత, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమెను అర్జున్ కపూర్ స్నేహితురాలు మలైకా అరోరాతో పోలుస్తున్నారు. మలైకా అరోరాలాగా అన్షులా కూడా మెల్లగా బోల్డ్ అవుతోంది అంటున్నారు నెటిజన్లు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sudigali Sudheer: గాలోడు మూవీ షూటింగ్ లో సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన వీడియో!