తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్దస్త్ షోలో కమెడియన్ గా అడుగు పెట్టిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా మారి దూకుడు పెంచాడు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్లో సుధీర్ స్కిట్స్ తో సుధీర్ చాలా పాపులర్ అయ్యాడు. తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు సుడిగాలి సుధీర్. దీంతో అతను మెల్ల మెల్లగా యాంకర్ గా రాణించి ఆ తర్వాత సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా మెరిశాడు. ఇక అనతి కాలంలోనే సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగానే మారిపోవడం విశేషం. సుధీర్ ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. దీంతో అప్పటి నుంచి సుధీర్ తన రూట్ ను పూర్తిగా మార్చేశాడు. అందివచ్చిన అవకాశాలను వడిసి పట్టుకుంటూ వరుస ఆఫర్లలతో కాస్త జోరును పెంచాడు. ఇదిలా ఉంటే దర్శకుడు పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న గాలోడు సినిమాలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇది కూడా చదవండి: Naresh: రాకేశ్ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్ ఈ మూవీలో సుధీర్ డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక విషయం ఏంటంటే.. గాలోడు సినిమా ప్రస్తుతం ఓ కాలేజీలో సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అయితే సుధీర్ ఈ సినిమానే కాకుండా ఇంకా రెండు, మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. సుడిగాలి సుధీర్ లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. https://youtube.com/shorts/lNI_TZmyRwE?feature=share