విభిన్నమైన సినిమాలతో అలరించే హ్యాండ్ సమ్ హీరో నాగశౌర్య.. బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. నాగశౌర్య వివాహం గురించి వార్తలు ఇలా వచ్చాయో లేదో.. నాగశౌర్య చేసుకోబోయే అనూష శెట్టి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వందల కోట్లకు అధిపతి అయినటువంటి బెంగళూరు బిజినెస్ మేన్ కుమార్తె ఈ అనూష శెట్టి. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. న్యూయార్క్ నగరంలో స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్ కోర్స్ నేర్చుకున్న అనూష శెట్టి.. బెంగళూరులో సొంతంగా ఇంటీరియర్ బిజినెస్ ని ప్రారంభించారు.
ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని రన్ చేస్తున్నారు. 2019లో డిజైనర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే అనూష శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినికి దూరపు బంధువు అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా నాగశౌర్య కుటుంబానికి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుటుంబానికి మధ్య బంధుత్వం ఉందని వార్తలు వచ్చాయి. నాగశౌర్యని లక్ష్మీ ప్రణతి అన్నయ్య అని పిలుస్తుందని అని టాక్ నడిచింది. ఇప్పుడు నాగశౌర్య కాబోయే భార్య అనూష శెట్టికి, ఎన్టీఆర్ తల్లి శాలినికి మధ్య కూడా బంధుత్వం ఉందని, దూరపు చుట్టాలు అని వార్తలు రాసేస్తున్నారు.
ఎన్టీఆర్ తల్లి శాలిని.. అనూష శెట్టి ఇద్దరూ కూడా కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు దగ్గరలో ఉన్న కుందాపూర్ సిటీకి చెందిన వారే కావడంతో అనూష శెట్టి, ఎన్టీఆర్ కుటుంబానికి దూరపు బంధువు అంటూ పుకార్లు పుట్టించేశారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. గతంలో నాగశౌర్య కుటుంబానికి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కుటుంబంతో బంధుత్వం ఉందంటూ వచ్చిన వార్తలపై నాగశౌర్య తల్లి ఉష ప్రసాద్ స్పందించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కజిన్ కి నాగశౌర్య మంచి స్నేహితుడు మాత్రమే అని, ఫ్యామిలీ ఫ్రెండ్ లా ఉంటారు తప్పితే ఎలాంటి బంధుత్వం లేదని ఆమె స్పష్టం చేశారు.
దీంతో నాగశౌర్య, లక్ష్మీ ప్రణతిల మధ్య ఎలాంటి బంధుత్వం లేదని తేలిపోయింది. తాజాగా నాగశౌర్య కాబోయే భార్య అనూష శెట్టికి , ఎన్టీఆర్ తల్లి శాలినికి బంధుత్వం ఉందని ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా కుందాపూర్ కి చెందిన వ్యక్తి అని, వీరి మధ్య కూడా బంధుత్వం ఉందని పుకార్లు పుట్టిస్తున్నారు. ఊరు ఒకటైతే బంధువులు ఎట్టా అవుతారు అంటూ నెటిజన్స్ విమర్శిస్తున్నారు. మరి కొంతమంది అయితే బంధువులైతే సో వాట్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.