సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలలో, సినీ ఈవెంట్స్ లో, ఆఖరికి టీవీలో కనిపించినా ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. అదే హీరోని లైవ్ లో చూస్తే ఆ ఫీల్ వేరు. కానీ.. అభిమాన హీరోని మరో స్టార్ హీరోతో.. ఒకే స్టేజ్ పై చూస్తే ఆ ఫ్యాన్స్ లో కలిగే ఆనందం ఏ లెవెల్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. ఆ ఇద్దరు హీరోలకు సంబంధించి వచ్చిన అప్ డేట్ ఊహించిన స్థాయిలో లేకపోతే కలిగే నిరాశ కూడా అంతే ఉంటుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణలకు సంబంధించి విడుదలైన ‘అన్ స్టాపబుల్ 2‘ ప్రోమో విషయంలో ఫ్యాన్స్ నిరాశ చెందారని తెలుస్తోంది.
ఫస్ట్ టైమ్ నటసింహం బాలయ్య, పవర్ స్టార్ లను ఒకే స్టేజ్ పై.. అదికూడా ఒకరు హోస్ట్ చేస్తున్న షోలో మరొకరిని హోస్ట్ గా చూడటం. బాలయ్య – పవన్ ల ఎపిసోడ్ కోసం దాదాపు ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అది అన్ స్టాపబుల్ మొదటి సీజన్ లో కుదరకపోయినా, ఎట్టకేలకు రెండో సీజన్ లో సాధ్యం చేశారు ఆహా వారు. అవును.. బాలయ్య షోలో ఏ స్టార్ వచ్చినా.. ఆయా హీరోలకు ఉండే క్రేజ్ వేరు. కానీ.. బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆ ఉత్సాహం నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. వీరి ఎపిసోడ్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇరు హీరోల అభిమానులు అంతే ఎక్సయిట్ మెంట్ తో చూస్తున్నారు.
ఫ్యాన్స్ అందరిని సర్ప్రైజ్ చేస్తూ.. అన్ స్టాపబుల్ టీమ్ పవన్ – బాలయ్య ఎపిసోడ్ ప్రోమో కూడా వదిలారు. కానీ.. వచ్చినా ప్రోమో ఎలా ఉందంటే.. ఏమాత్రం పస లేదని అంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. ఎందుకంటే.. రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూ సినిమాలు చేస్తున్న పవన్, ఫస్ట్ టైమ్ ఒక టాక్ షోకి వస్తే.. ఆయన నుండి కనీసం రెండు మూడు విషయాలైనా ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాంటిది ప్రోమో రిలీజ్ చేశారుగానీ.. ఏ ఒక్క విషయాన్నీ రివీల్ చేయలేదు కదా.. మినిమమ్ ఏం ఆన్సర్ ఇచ్చారనే ఎక్సయిట్ మెంట్ ని ప్రోమో ద్వారా తగ్గించేశారని అంటున్నారు. పవన్ ఎపిసోడ్ కోసం దేశమంతా వెయిట్ చేస్తోంది. ఇలాంటి టైమ్ లో మ్యాటర్ లేని ప్రోమో వదిలి నిరాశపరిచారని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇద్దరూ సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు. అల్రెడీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కూడా వచ్చి సందడి చేసి వెళ్ళాడు. మరి పవన్ కళ్యాణ్ వస్తే.. అంచనాలు పీక్స్ లో ఉంటాయి. పైగా వీరిద్దరూ అటు రాజకీయాలలో, ఇటు సినిమాలలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. ప్రోమో చూస్తుంటే.. ఏమి రివీల్ చేయలేదు. కాబట్టి.. పూర్తి ఎపిసోడ్ లో ఫుల్ కంటెంట్ ఉండి ఉంటుందని, అది చూశాక ఫ్యాన్స్ పూర్తిగా శాటిస్ఫై అవుతారనే టాక్ ఉంది. సో.. పవన్ ఎపిసోడ్ కి ప్రోమోలు అవసరం లేదు, జస్ట్ ఎపిసోడ్ వదిలాకే చూసుకుంటాం అని ఫ్యాన్స్, నెటిజన్స్ అభిప్రాయం. చూడాలి మరి, ప్రోమో రిజల్ట్ ఎలా ఉన్నా ఎపిసోడ్ వచ్చాక రచ్చ జరగబోతుంది. మరి బాలయ్య – పవన్ ల ప్రోమోపై మీ అభిపప్రాయాలు, ఫుల్ ఎపిసోడ్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి.