Nani: ‘అంటే! సుందరానికి’’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ దగ్గరినుంచి నిన్న మొన్నటి ట్రైలర్, పాటలకు వరకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్స్ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ తొలిసారి తెలుగులో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. జూన్ 9న జరగబోయే గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. పవన్ రాక.. నాని, పవన్ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. సినిమా బృందం కూడా కొత్త ఉత్సాహంతో ఉంది. మరో వైపు నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయలు చిత్ర ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ షూటింగ్ సమయంలో నజ్రియా, తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ లాక్డౌన్ టైంలో ఫారెన్‌లో షూటింగ్ కోసం వీసాలకు అప్లై చేశాం. టీం అందరికీ వీసా వచ్చింది. దర్శకుడికి వీసా రాలేదు. ఆన్లైన్లో షూటింగ్ జరిగింది. మేము బాగా చలిలో ఉన్నాం. ఒణుకుతూ ఉండేవాళ్లం. వివేక్ కంఫర్టబుల్‌గా రూంలో కూర్చుని వన్మోర్,వన్మోర్,వన్మోర్ అనేవాడు. మేము మాత్రం ‘ఈ నీయవ్వ నువ్వు వచ్చుంటే తెల్సేది నీకు’ అనుకునే వాళ్లం. మైనస్ డిగ్రీల్లో ఉన్న చలికి ఒణికిపోయేవాళ్లం. టీం మొత్తం ఐదు స్వెటర్లు వేసుకుని ఒణికిపోయేవాళ్లు. నేను, నజ్రియా మామూలు డ్రెస్‌లో ఉండేవాళ్లం. చలికి చచ్చిపోతాం అన్నట్లు ఉండేది. తాగుదాం అనిపించింది. తాగాను కూడా. హీరోయిన్ తాగలేదు’’ అంటూ చలిలో తాము పడ్డ కష్టాలను చెప్పుకొచ్చారు.అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో నజ్రియా మాట్లాడుతూ… నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నేను చెైల్డ్ ఆరిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టాను. టీవీలోని పలు షో యాంకర్ గా చేశాను. రెండేళ్లు వరుసగా సౌత్ ఇండియాలో పలు సినిమాలు చేశాను. అనంతరం ఫాహద్ ఫాజిల్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చాను. ‘అంటే..సుందరానికీ’ కథ ఆసక్తిగా అనిపించడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఈ చిత్రంలో నేను చేసిన లీలా థామస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలుగులో ఇది నాకు తొలి డైరెక్ట్ ఫిల్మ్. తెలుగు నాకు కొత్త భాష అయినప్పటికీ నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను” అని అన్నారు. మరి, ఇంటర్వ్యూలో మందు తాగటంపై నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలయజేయండి.
ఇవి కూడా చదవండి : Nazriya: మన పిల్లలకైనా ఆ విషయంలో సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్