దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ఇక రాజమళి దెబ్బతో ఇంతకు ముందున్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇప్పటికీ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో రూ.1000 కోట్ల చేరువలో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే RRR అభిమానులకు మరో శుభవార్త అందినట్లైంది.
ఈ మూవీ విడుదలైన రోజు నుంచి సినిమా టికెట్ ఎక్కువ ధరలతో అమ్మారు. అయినా సరే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలాగైనా చూడాలనే ఆసక్తితో ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తున్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో మధ్య తరగతి సినిమా ప్రేమికులు ఈ సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
ఇది కూడా చదవండి: బాహుబలి-2 టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసిన RRR!
పది రోజుల తర్వాత చూద్దాంలే అన్నట్టు ఆగారు. 10 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. దీనికి తోడు రోజు ఐదు షోలు వేసుకోవడానికి ఉభయ రాష్ట్రాలు ప్రత్యేకంగా అనుమతులు కూడా ఇచ్చాయి. ఈ రోజు నుంచి తక్కువ రేటు అమల్లోకి రావడంతో రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లో రూ. 175 కాగా మల్టీప్లెక్స్‌లో రూ. 295 ప్రైస్ ఉంది. ఏపీ విషయానికొస్తే.. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 145, మల్టీప్లెక్స్‌లో రూ. 177 ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.