‘ నా ప్రాణమా నను వీడిపోకుమా.. నీ ప్రేమలో నను కరుగ నీకుమా.. పదే పదే నా ప్రాణం నిన్నే కలవరిస్తోంది. వదన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది.. అనిత ఓ అనిత నా అందమైన అనిత.. దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ మీద...
‘అనిత ఓ అనిత నా అందమైన అనిత’… ఈ పాట గురించి తెలియని నైన్‌టీస్ కిడ్స్ ఉండరు అంటే అందులో ఎలాంటి అతిశయోక్తిలేదు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ పాట ఓ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఏ ఫంక్షన్ జరిగినా.. ఇంట్లోని టేపు రికార్డుల్లో.. సీడీ, డీవీడీ ప్లేయర్లలో.. ట్రాక్టర్లు, ఆటోలలో ఈ పాట అత్యంత తరచుగా వినిపించేది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరి నోళ్లలో ఈ పాట వినిపించేది. అంతటి సంచలానాన్ని క్రియేట్ చేసిన ఈ పాట పాడిన, రాసిన వ్యక్తి పేరు నాగరాజు. అతడు మొదటి పాటతోటే చాలా పాపులర్ అయ్యాడు.
సినిమాల్లో రానిస్తాడని అనుకున్న అతడు ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు. సుమన్ టీవీ నాగరాజును ఇంటర్వ్యూ చేయగా.. అతడి జీవితంలోని విషాదాలు బయటపడ్డాయి. లవ్ బ్రేకప్.. పిల్లల అనారోగ్యం వంటి వాటి గురించి చెబుతూ నాగరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. ‘‘ నేను, అనిత ప్రేమించుకున్నాము. ఇద్దరికీ బ్రేకప్ అయింది. వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో విడిపోయాము.
అనితతో బ్రేకప్ తర్వాత బాధలో ‘అనిత ఓ అనిత ’ పాట రాశాను. దాదాపు నెల రోజులు కష్టపడి ఈ పాట రాశాను. నేను సింగర్‌ను. ఆర్కేస్ట్రాలో పని చేసే వాడిని. ఈ పాటను నేనే స్వయంగా పాడాను. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. నాకు వేరే అమ్మాయితో పెళ్లి అయింది. నాకు మంచి అమ్మాయి భార్యగా వచ్చింది. తన పేరు దేవిక. మాకు ఇద్దరు పిల్లలు. మా పెద్దబ్బాయి మూగ, చెవుడు. పెద్దాబ్బాయితో ఉండి చిన్నవాడు కూడా సైగలు చేస్తూ ఉన్నాడు.
వాడి పరిస్థితి కూడా అలానే ఉంది. ఊర్లో ఎవరన్నా పిలిస్తే పాటలు రాసిచ్చే వాడిని. పాన్‌షాప్‌తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. కళామతల్లి నన్ను కాపాడుతుందని మళ్లీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు అనిత 2 పాట రాబోతోంది. ఇప్పటికే కంపోజింగ్ అయిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు. మరి, 15 ఏళ్ల క్రితం ఓ ఊపు ఊపిన అనిత పాట సృష్టికర్త నాగరాజు జీవితంలోని విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.