తెలుగు బుల్లితెరపై చాలా మంది యాంకరమ్మలు ఉన్నారు. కానీ.., వీరిలో విష్ణు ప్రియ స్థానం మాత్రం ప్రత్యేకం. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న విష్షు అతి తక్కువ కాలంలోనే బుల్లితెర పైకి దూసుకొచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ సరసన చేసిన “పోవే పోరా” విష్ణు ప్రియకి మంచి క్రేజ్ వచ్చేలా చేసింది.
తరువాత కాలం నుండి విష్ణు ప్రియ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కొన్నేళ్ల పాటు ఈమె బిజీ హోస్ట్ గా రాణించింది. అయితే.., హాట్ యాంకర్ ట్యాగ్ తగిలించుకున్న విష్ణు ప్రియ చేతిలో ప్రస్తుతం పెద్దగా షోలు లేవు. కొన్ని పోగ్రామ్స్ లో గెస్ట్ గా మెరవడం తప్ప విష్ణు ప్రియ అంత బిజీగా లేదు. దీంతో.., ఈ అమ్మడి చూపు ఇప్పుడు పెళ్లి వైపు మళ్లిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
షో ఏదైనా ఘాటైన అందాలను ఆరబోయడం విష్ణు ప్రియకి అలవాటు. ఇక సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఈ అమ్మడు అభిమానులకి టచ్ లో ఉంటూనే వస్తోంది. ఇక ఎప్పటికప్పుడు స్కిన్ షోతో రెచ్చిపోయే విష్ణు ప్రియ తాజాగా చేసిన ఓ పోస్ట్ అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది.
తనకు ఆషికి-2 సినిమాలో హీరో ఆదిత్యరాయ్ కపూర్‌లాంటి వ్యక్తి భర్తగా కావాలని, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయితే ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది ఈ హాట్ యాంకర్. ఈ ముద్దుగుమ్మ కోరిక చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక గతంలో విష్ణు ప్రియ అక్కినేని అఖిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పి ఇలాంటి రచ్చే చేసింది. మరి.., ఇన్ని కోరికలు ఉన్న విష్ణు ప్రియకి రియల్ లైఫ్ లో ఎలాంటి వ్యక్తి భర్తగా వస్తాడో చూడాలి.