తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్‌తో అలరిస్తుంది. గంగులు అనే సాంగ్‌తో ముందుకొచ్చింది. కాగా, విష్ణుప్రియ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో మాట బయటపెట్టింది.
బుల్లి తెరపై అనేక మంది యాంకరమ్మలు అలరిస్తున్నారు. వీరిలో తన గ్లామరస్ షో కట్టిపడేస్తుంటుంది విష్ణుప్రియ. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ప్రత్యేక సాంగ్స్‌తో అలరిస్తుంది. బుల్లి తెర నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్‌తో కలిసి గతంలో జరీ జరీ పంచె కట్టి అనే జాన పదం సాంగ్‌కు డ్యాన్స్ చేయగా.. ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే తాజాగా ఈ జంట గంగులు అనే సాంగ్‌తో ముందుకొచ్చింది. ఈ సాంగ్‌లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, డ్యాన్స్ వర్కవుటయింది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో నడుస్తోంది. కాగా, విష్ణుప్రియ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని తన మనస్సులో ఉన్న వ్యక్తి గురించి బయటపెట్టింది.
మాటీవీలో ప్రసారం అవుతున్న ఓంకార్ షో సిక్త్ సెన్స్. సీజన్ 5 నడుస్తుంది. ఈ కార్యక్రమానికి సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ వంటి వారితో పాటు పలువురు నటీనటులు హాజరవుతున్నారు. ఫుల్ ఫన్ అండ్ టెన్షన్ తో కూడిన ఈ గేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. తాజాగా ఈ షోకు బుల్లితెర యాంకర్లు విష్ణుప్రియ, రవిలు హాజరయ్యారు. ఎగ్ పగలకొట్టే టాస్కులో భాగంగా విష్ణుప్రియను.. యాంకర్ ఓంకార్ ఓ ప్రశ్న వేశాడు. ‘ఇప్పుడు సెలబ్రిటీ క్రష్ ఉన్నారా’ అని అడిగేసరికి ‘రీసెంట్‌గా ప్రేమలో పడ్డా. ఆయన వయసు నాకు సరిపోకపోవచ్చు అని మీరు అనుకుంటారు. ఆయనే జేడీ చక్రవర్తి. ఆంటీ ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లిపోతాను’అని సమాధానం ఇచ్చింది విష్ణుప్రియ.
‘ఎందుకు నీకు ఆయనంటే ఇష్టం’ అని యాంకర్ ఓంకార్ అడిగేసరికి ‘ఒక వెబ్ సిరీస్ కోసం 40 డేస్ మంగళూరులో ఆయనతో జర్నీ చేసాను. ఆ జర్నీలో పదో రోజు నేను ఫుల్ ఫ్లాట్ ఐపోయాను.’ అని చెప్పింది. ‘ఏ విషయంలో ప్రేమలో పడిపోయావ్’ అని ఓంకార్ అడగ్గా.. ‘చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఒకసారి అలా వాల్కనోలా పేలి 2022 నవంబర్ 25 వ తేదీ రాత్రి నాకు అర్ధమయ్యింది. నేను జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నాను’ అనే విషయం తెలిసింది అని చెప్పింది. ‘ఆ ప్రేమ ఏమన్నా పెళ్లిగా మారే ఛాన్స్ ఉందా’ అని అడిగేసరికి ‘నేనైతే ఆయనకు చెప్పాను. ఆయన రెస్పాండ్ అవలేదు’అని చెప్పింది.
‘రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నావా’ అని రవి అడిగేసరికి ‘ ఐ హోప్ సో..నా మనసులో ఏముందో ఆయనకు చెప్పేసాను. ఆల్రెడీ 28 ఏళ్ళు వచ్చేసాయి. తెల్ల జుట్టు కూడా వచ్చేస్తోంది. టైం వేస్ట్ చేయడం ఇష్టంలేక చెప్పేసాను’ అంది. విష్ణుప్రియ ‘పోవే పోరా’షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కాగా, జెడీ చక్రవర్తి.. నటి అనుకృతిని 2016లో వివాహం చేసుకున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు పెళ్లైన, సీనియర్ హీరోను ప్రేమిస్తున్నానని విష్ణుప్రియ చెప్పడం వెనుక మానస్ తో రుమార్లకు తెరదించడానికేనా అని తెలియాల్సి ఉంది.