ఈమె ఫేమస్ యాంకర్. ఆరడుగుల పొడుగు ఉండటమే కాదు అందంతోనూ ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. చూస్తే మీరు కచ్చితంగా మెల్ట్ అయిపోయారు. మరి ఎవరో గుర్తుపట్టారా?
యాంకర్స్ అంటే ఒకప్పుడు గలగలా మాట్లాడేవారు. ఇప్పుడు దానితోపాటు గ్లామర్ అనే మరో టాపిక్ తో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎక్స్ పోజ్ చేసే విషయంలో ఏ మాత్రం అడ్డుచెప్పట్లేదు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా సేమ్ ఆ బాపతే. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గానూ పలు సినిమాలు చేసింది. గ్లామర్ షోతో ఎప్పటికప్పుడూ హీట్ పెంచుతూనే ఉంది. ఈమె తల్లి రీసెంట్ గానే చనిపోవడంతో ప్రస్తుతం ఆ బాధలో ఉంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈమె తెలుగమ్మాయి. ఆరడగులు ఎత్తు ఉంటుంది. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ తో కలిసి ‘పోరా పోవే’ షో చేసింది. అది ఈమె కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దీంతో షోలు, పండగ ఈవెంట్స్ లో తెగ సందడి చేసింది. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ విష్ణుప్రియ. యాంకర్ గా ఇప్పటికే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి సంబంధించిన చిన్నప్పటి పిక్ ఒకటి వైరల్ గా మారింది. అలా ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకునేలా చేసింది.
‘పోరా పోవే’ షోతో యాంకర్ గా మారిన విష్ణుప్రియ.. ఆ తర్వాత ఈటీవీలోనే దాదాపు రెండు మూడేళ్లపాటు షోలు చేసింది. ఈమెని మెయిన్ గా పెట్టి కూడా షోలు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య ‘పండుగాడ్’ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా చేసింది. ఆ మధ్య ‘జరీ జరీ పంచెకట్టి’ అనే ఆల్బమ్ సాంగ్ తో అలరించిన విష్ణుప్రియ.. రీసెంట్ గా అదే మానస్ తో కలిసి మరో పాట కూడా చేసింది. ఈ మధ్య విష్ణుప్రియ తల్లి సడన్ గా అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఈ బ్యూటీ కోలుకుంటోంది. సో అదనమాట విషయం. మరి ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.