బుల్లితెర యాంకర్లు సైతం స్టార్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. టీవీ షోలకు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ వచ్చాక.. బోల్డ్ గా తయారై.. టీవీ షోలకు దూరంగా ఉంటోంది.
ఈ మధ్యకాలంలో బుల్లితెర యాంకర్లు సైతం స్టార్ హీరోయిన్స్ కి మించిన బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. టీవీ షోలకు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ వచ్చాక.. బోల్డ్ గా తయారై.. టీవీ షోలకు దూరంగా ఉంటోంది. అంతేగాక అడపాదడపా సినిమాలు ఓకే చేస్తూ.. హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ క్రమంలో కొన్నాళ్లుగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉంటున్న విష్ణుప్రియ.. తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ.. తన కెరీర్, బాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కిస్ లాంటి విషయాలను నిర్మొహమాటంగా బయట పెట్టేసిందట. ఎప్పుడో ఓసారి టీవీ షోస్ లో మెరిసే విష్ణుప్రియ.. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ షాకయ్యే రేంజ్ లో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఇటీవల నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ సాంగ్.. స్టేజ్ పెర్ఫార్మన్స్ లు సైతం చేసి అలరించింది. కాగా.. ప్రస్తుతం విష్ణుప్రియ ఏం చేస్తోంది? ఎందుకని టీవీలో, సినిమాలలో కనిపించడం లేదు? అనే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి వార్తల్లో నిలిచింది అమ్మడు.
ఈ నేపథ్యంలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. “నాకు పర్సనల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా. ఒకవేళ వాడున్నా నా టైమ్ అంతా వృథా అయిపోయేది. నేను రిలేషన్ షిప్ లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాను. ఇప్పటిదాకా నేను బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ ని దూరం పెట్టకుండా.. ఇంకా వాళ్ళని ఫ్యామిలీగా చూసుకుంటాను. ఇక నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్.. 17 ఏళ్లకే జరిగింది. బిగ్ బాస్ షో విషయానికి వస్తే.. తెలుగు షోపై నాకు ఇంటరెస్ట్ లేదు, కానీ హిందీ బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తాను. ఎందుకంటే.. తెలుగులో బాగా ఆడేవాళ్లు కూడా ఓడిపోతుంటారు.” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి విష్ణు ప్రియ కెరీర్, ఆలోచన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.