బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపించే ప్రియ కూడా చాలా కష్టాలు పడింది.
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట న్యూస్ జర్నలిస్టుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించిన ఆమె ఇప్పుడు పూర్తి విభిన్నంగా గ్లామరస్ షో చేస్తోంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బుల్లితెర మీదే పలు ఈవెంట్లలో, షోలలో కనిపించారు. పలు సినిమాల్లో కూడా నటించింది. 2016లో ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’తో పాటు 2020లో ‘చెక్ మేట్’అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఇటీవల ప్రైవేట్ ఆలమ్స్ చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తోంది. ఇందులో ఆమె అందాలను ఆరబోస్తూ.. చూపు తిప్పుకోనివ్వడం లేదు.
అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది విష్ణు ప్రియ. కాగా, ఇటీవల సీరియల్ నటుడు మానస్, ప్రియ కలిసి గంగులు అనే సాంగ్ లో నటించారు. గతంలో కూడా వీరిద్దరూ జరీ జరీ పంచెకట్టి అనే సాంగ్ చేసిన సంగతి విదితమే. ఆ సాంగ్ లో విష్ణు ప్రియ బోల్డ్ లుక్‌లో కనిపించింది. తాజాగా విడుదలైన గంగులు సాంగ్‌లో కూడా ఆమె రెచ్చిపోయి డ్యాన్స్ వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా మై విలేజ్ షో వీరితో కలిసి దావత్ చేసుకుంది. ఈ సందర్భంగా విష్ణు ప్రియ తన గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే ఆమె వెనుక కన్నీటి పొర గురించి వెల్లడించింది.
చాలా ఫన్నీగా మొదలైన ఈ దావత్.. కాస్త సెంటిమెంట్ రంగరించుకుంది. తమ అమ్మనాన్నలదీ చీరాల, బాపట్ల అని, తాను పుట్టిందీ చెన్నయ్ అని చెప్పింది. తనకు మూడేళ్ల సమయంలో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లు తెలిపింది. 2015లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చానని, బ్రేక్ వచ్చిందీ పోవే పోరాతోనని చెప్పింది. పోవే పోరా, నంబర్ వన్ యారీ ఒకే టైంలో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. నంబర్ వన్ యారీ సమయంలో చాలా సన్నగా కనిపించడం వెనుక కారణాలను చెబుతూ..అప్పట్లో సరిగా తిండి లేదని, ఇప్పుడు కాస్తంత డబ్బులు సంపాదించుకుని ఆర్డర్స్ పెట్టుకుని తింటున్నానని తాను పడ్డ కష్టాలను కూడా ఫన్నీగా చెప్పింది.
‘వాస్తవంగా చెప్పాలంటే.. మా అమ్మ సినిమా పరిశ్రమలో ఉంది, తన చిన్నప్పుడు శ్రియ, ఆర్తి అగర్వాల్‌కు హెయిర్ డ్రసెర్‌గా పనిచేసింది. మా అమ్మ చాలా టాలెంటెడ్. భరత నాట్యం నేర్చుకుంది. ఆమె వీడియోలు చూసి.. ఇంత టాలెంటెడ్ మమ్మీ హెయిర్ డ్రసెర్ గా అయ్యిందేంటీ అని చిన్న ఫీలింగ్ వచ్చింది. తన కోసం సినిమాల్లో చేసినప్పుడు.. మా మమ్మీ హెయిర్ డ్రసెర్ కాదూ.. యాక్టర్ వాళ్ల మమ్మీ అని చెప్పుకోవాలన్న ఉద్దేశంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చా. అయితే ఈ జనవరిలో ఆమె చనిపోయింది. నా విషయంలో సాటిస్ ఫైడ్ కాలేదు కానీ.. ఓకే అని ఫీలయ్యింది. నా విషయంలో నేను చాలా సాధించానని’ఫీల్ అవుతున్నానని పేర్కొంది.