యాంకర్ విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు పొందిన ఈ అమ్మడు... యాంకర్ గా చేస్తూ బుల్లితెరపై మెరిసింది. ఇటీవల కాలంలో తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. గతంలో మానస్ తో కలిసి ఓ పాటకు స్టెప్స్ వేసిన ఈ అమ్మాడు.. మరోసారి కూడా జతకట్టి సందడి చేసింది.
యాంకర్ విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు పొందిన ఈ అమ్మడు… యాంకర్ గా చేస్తూ బుల్లితెరపై మెరిసింది. ఇటీవల కాలంలో తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. అలానే ఇటీవల డ్యాన్స్ లు చేస్తూ తెగ రచ్చ చేస్తోంది. ఇటీవలే బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలసి విష్ణు ప్రియ ఓ ఊపు ఊపేసింది. ‘జరీ పంచె కట్టి జారుడు’ అని పాటకు అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో ఫోక్ సాంగ్ విడుదలైంది. నెట్టింట ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ ఫేమ్ మానస్ , విష్ణు ప్రియ డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద పాట తాజాగా విడుదలైంది. నివ్రితి వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఘనంగా విడుదల చేశారు. ఈ సాంగ్ కు జ్యోతి కున్నూరు నిర్మాత గా భీమ్స్ సిసిరిలియో సంగీత సారథ్యంలో ప్రముఖ కోరియెగ్రాఫర్ జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ సాంగ్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ పాట విషయానికి వస్తే.. తరుణ్ సైదులు లిరిక్స్ రాయగా, స్వరాజ్ కీర్తన్ వినసొంపుగా పాడాడు. అలానే గంగులో పాటకు భీమ్ సిసిరిలియో మంచి సంగీతం అందించారు. ఆ మ్యూజిక్ తగ్గట్టే సాయి శ్రీరామ్ కూడ చాలా చక్కని విజువల్స్ అందించాడు. శ్రష్టి వర్మ కోరియోగ్రఫీ లో వచ్చిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ పాటకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల టీమ్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇందులో మానస్, విష్ణుప్రియ మధ్య కెమిస్ట్రి అద్భుతంగా ఉంది. అలానే అదిరిపోయే స్టెప్స్ వేస్తూ మానస్, విష్ణుప్రియా ఆకట్టుకున్నారు.
ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ కి మానస్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన తెలుగు పదాలతో వచ్చిన ఈ ఫోక్ సాంగ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అన్నారు. ఇక విష్ణుప్రియా మాట్లాడుతూ.. మానస్‌తో కలిసి ఇంతకుముందు చేసిన “జరీ జరీ పంచె కట్టు” పాటకు మంచి ఆదరణ దక్కిందని, తాజాగా ‘గంగులు’ పాట కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ గంగులు పాట సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. మరి.. మీరు వీడియోను వీక్షించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.