వర్షిణి సౌందరరాజన్.. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వర్షిణి పేరు వినగానే.. ఒకప్పుడు ఢీ షోలో వేసిన మూన్ స్టేప్పే ముందుకు అందరికి గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత.. ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుని.. ప్రస్తుతం మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది. ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ‘పటాస్2’; ‘ఢీ’ వంటి షోలు ఈమె క్రేజ్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. అవ్వడానికి తమిళమ్మాయే అయినప్పటికీ.. తెలుగులో ఈ అమ్మడు బాగా క్లిక్ అయ్యింది. ప్రస్తుతం వర్షిణి వరుస షోలతో బిజీగా గడుపుతోంది. అంతేకాక ‘శంభో శివ శంభో’ ‘చందమామ కథలు’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించింది వర్షిణి.
సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ తన పోస్టులతో రచ్చ లేపుతుంది వర్షిణి. ఢీ షోలో ఓ సీజన్‌లో ఆదితో కలిసి తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా.. తాజాగా హైపర్ ఆది, వర్షిణి తమ అభిమానులతో పాటు నెటిజనులకు కూడా ఊహించని షాక్ ఇచ్చారు. తాజాగా వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ చూస్తే.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పైనే కాక.. రియల్ లైఫ్‌లో కూడా నిజంగానే రిలేషన్‌లో ఉన్నారా అనే అనుమానం రాక మానదు. ఇన్ని అనుమానాలు క్రియేట్ చేస్తూ.. తెగ వైరలవుతోన్న ఆ పోస్ట్‌లో ఏం ఉందో తెలియాలంటే ఇది చదవండి ..
ఇది కూడా చదవండి: ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందా అంటూ యాంకర్ వర్షిణి ప్రశ్న
హైపర్ ఆది తన బర్త్‌డేని.. యాంకర్ వర్షిణితో కలిసి ప్రయివేట్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోని వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం.. అది షాకింగ్‌గా ఉండటమే కాక వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోలో వర్షిణి ఆదికి కేక్ తినిపించడం.. అతడిని ప్రేమగా కౌగిలించుకోవడం వంటివి చూస్తుంటే వీరిద్దరూ ఎప్పటి నుంచో రిలేషన్‌లో ఉన్నట్లు అనుమానం కలుగుతుంది.
ఇది కూడా చదవండి: ఆ డైరెక్టర్ సినిమా అవకాశం ఇస్తానని చెప్పి ఇంటికి రమ్మన్నాడు!
ఇక వీడియోతో పాటు.. షేర్ చేసిన క్యాప్షన్ మరింత క్రేజీగా ఉంది. ‘‘డియర్ ఆది.. హ్యాపీ బర్త్ డే. నా జీవితం మొత్తం నీవు తోడుగా ఉండాలి. నా ఫేవరేట్ పర్సన్, సపోర్ట్ సిస్టం నువ్వే. రైటర్ ఆది నువ్వు నాకు రైట్ రా ఆది’’ అనే క్యాప్షన్‌తో పాటు లవ్ ఎమోజిలు పోస్ట్ చేసింది. దాంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Allu Arjun: బ్రేకింగ్: అల్లు అర్జున్‌పై కేసు నమోదు!
ఈ పోస్ట్ చూసిన నెటిజనులు కూడా ఇలానే స్పందిస్తున్నారు. నీ లాస్ట్ కామెంట్ చూస్తుంటే డౌట్ గా ఉంది.. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు వీరిద్దరి జోడి బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఢీ షోలో ఉన్నప్పుడు ఆది, వర్షిణి చాలా సార్లు రొమాంటిక్ డాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. వర్షిణి పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.