విరాట్ కోహ్లీ ఒక్క పోస్ట్ కి దాదాపు 12 కోట్లు ఆర్జిస్తున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఈ విషయంపై తాజాగా కోహ్లీ స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తూ నీళ్లు తాగినంత సింపుల్ గా సెంచరీలు కొట్టే కింగ్ కోహ్లీ కోట్ల అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అభిమానులకి ఈ ఢిల్లీ బ్యాటర్ అంటే ఒక మత్తు . ఎప్పుడూ పరుగులు చేయాలనే తపన, ఎవరికీ తలవంచని ఆటిట్యూడ్, గెలుపు తప్ప మరో ఆలోచన లేని వ్యక్తిత్వం ఈ పరుగుల వీరుడిని అందనంత ఎత్తులో నిలబెట్టింది. ఇక సోషల్ మీడియాలో అయితే కోహ్లీ హవా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలోనే అత్యధిక ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న రికార్డ్ ప్రస్తుతం కోహ్లీ పేరు మీదే ఉంది. ఇదిలా ఉండగా.. కోహ్లీ ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి 11.45 కోట్లు సంపాదిస్తుడని తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై తాజాగా కోహ్లీ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
ప్రస్తుతం కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 256 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత భారీ ఫాలోయింగ్ ఉండటం కారణంగా కోహ్లీకి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. అయితే ఒక్క పోస్ట్ కి ఏకంగా 12 కోట్లు ఆర్జిస్తున్నాడనే విషయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎంత ఇంటర్నేషనల్ సెలబ్రిటీకి అయినా ఇంత భారీ మొత్తం లభించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. గత రెండు రోజులుగా ఈ న్యూస్ చక్కర్లు కొట్టడంతో కోహ్లీ తాజాగా ఈ విషయంపై అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు కోహ్లీ చెప్పిన ఆన్సర్ విని ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కోహ్లీ ఇంత భారీ మొత్తంలో సంపాదిస్తుడని తెలిసి పండగ చేసుకున్న అభిమానులకి ఒక చిన్న షాక్ ఇచ్చాడు.
కోహ్లీ మాట్లాడుతూ “ఇన్‌స్టాగ్రామ్ లో నా సంపాదనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. జీవితంలో నేను సంపాదించిన ప్రతి రూపాయికి కృతజ్ఞత చూపిస్తూ ఋణపడి ఉన్నాను”. అని ట్వీట్ చేసాడు. దీంతో కోహ్లీ ఒక్క ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి 12 కోట్ల రూపాయలు రావడం అబద్ధమని తేలిపోయింది. ప్రస్తుతం కోహ్లీ విండీస్ పర్యటనకు దూరంగా ఉంటున్నాడు. త్వరలో ఆసియా కప్, ఆ తర్వాత స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో కోహ్లీ టీమిండియాకు చాలా కీలకంగా మారనున్నాడు. మొత్తానికి కోహ్లీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏
— Virat Kohli (@imVkohli) August 12, 2023