తెలుగు బుల్లితెరపై కొన్నేళ్లుగా అలరిస్తున్న షోలలో ‘క్యాష్ ప్రోగ్రామ్’ ఒకటి. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రతీవారం కొత్త కొత్త సెలబ్రిటీలు సందడి చేస్తుంటారు. అలాగే సినిమా రిలీజ్ దగ్గరపడిన టీమ్ కూడా క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసుంటారు. ఈ క్రమంలో తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లోకి ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ టీమ్ పాల్గొన్నారు. జబర్దస్త్ సుధీర్, సునీల్, అనసూయ, విష్ణుప్రియ, దీపికా పిల్లి, నిత్యాశెట్టి, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక క్యాష్ ప్రోగ్రాంలోకి విష్ణుప్రియ, యష్ మాస్టర్, నిత్యాశెట్టి, అనసూయలతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుండగా.. అందులో రాఘవేంద్రరావు యాంకర్ అనసూయ చేయి పట్టుకొని షోలో అడుగుపెట్టడం హైలైట్ అయ్యింది. అనసూయ చేయి పట్టుకుని ఎందుకొచ్చారని అడిగితే.. కాలేజీ రోజుల్లో అనసూయ అనే అమ్మాయి ఉండేదని.. ఆ పాత రోజులు గుర్తొచ్చాయని చెప్పారు రాఘవేంద్రరావు.
ఆ వెంటనే సుమ అందుకుంటూ.. ‘మీ లైఫ్ లో సుమ పేరుతో ఎవ్వరూ తగల్లేదా సర్?’ అని అడిగింది. దీంతో సుమ సుమ లేని లైఫ్ ఉందా అసలు.. నా వల్లే కదా నీకు పెళ్ళైంది అని చెప్పారు. ఆ మరుక్షణమే ‘ఆ పాపం మీదే సర్’ అంటూ నవ్వేసింది. ఇక సుమ డైలాగ్ తో సోషల్ మీడియాలో రాజీవ్ తో పెళ్లిపై సుమ కామెంట్ చేయడంపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సుమ మాటలు వైరల్ అవుతున్నాయి. మరి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.