యాంకర్ శ్రీముఖి అనే కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పని లేదు. అటు యాంకరింగ్ మాత్రమే కాకుండా స్పెషల్ ఈవెంట్స్, సినిమాల్లోనూ శ్రీముఖి తానేంటో నిరూపించుకుంది. చిరంజీవి భోళా శంకర్ సినిమాలోనూ మంచి పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అటు బిజినెస్ ఉమెన్ గా కూడా శ్రీముఖి తానోంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తోంది. అటు యూట్యూబ్ లోనూ శ్రీముఖి ట్రెండీ వీడియోస్, వ్లాగ్స్ చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్టులు వైరల్ గా మారాయి..
ఇదీ చదవండి: నయన తార పెళ్లిపై జ్యోతిష్యుడు వేణు స్వామి ఓపెన్ కామెంట్స్!
ఎందుకంటే మే 10న రాములమ్మ శ్రీముఖి పుట్టినరోజు. బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో శ్రీముఖి ఎంతో సంతోషంగా గడిపింది. తన తమ్ముడు, తమన్నా సింహాద్రి, ఆర్జే చైతు, సింగర్ సాకేత్ వంటి ఎంతో మంది శ్రీముఖికి బర్త్ డే విషెస్ చెప్పారు. తనకు విషెస్ చెప్పిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరి పోస్టులను శ్రీముఖి ఇన్ స్టా స్టోరీగా పెట్టుకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీముఖి బర్త్ డే పోస్టులే వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఆర్జే చైతు, సింగర్ సాకేత్ పోస్టులు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఆర్జే చైతు శ్రీముఖిని హత్తుకున్న ఫొటో షేర్ చేయగా.. దానిని స్టోరీలో పెడుతూ శ్రీముఖి టుగెదర్ ఫరెవర్ అంటూ హార్ట్ సింబల్ పెట్టింది. సాకేత్ శ్రీముఖి, తాను కలిసున్న పిక్ పెట్టి లవ్ యూ అంటూ చెప్పగా అందుకు శ్రీముఖి లో యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఏదేమైనా రాములమ్మ పుట్టినరోజు సందర్భంగా విషెస్, పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. మరి, కామెంట్స్ రూపంలో మీరూ శ్రీముఖికి బర్త్ డే విషెస్ చెప్పండి.