సినిమా వాళ్లు, సెలబ్రిటీలు, టీవీ ఆర్టిస్టులు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించడం, వారి డైలీ యాక్టివిటీస్ ని అభిమానులతో పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. యాంకర్ రవికి కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. 2014 నుంచి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ తెలుగు 5లో తనతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రియాంక సింగ్, సిరి హన్మంత్, నటి ప్రియలతో కలిసి ఓ సరదా వీడియో షూట్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: నేను మోసపోయా.. శ్రీకాంత్‌రెడ్డి 420 : కరాటే కళ్యాణి
ఆ వైరల్ ప్రమోలో ఏముందంటే.. వీళ్లంతా కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ వీళ్లు చేసిన అల్లరి, సరదా మూమెంట్స్ మొత్తం ఓ వీడియోగా రూపొందించారు. బిగ్ బాస్ లోనే యాంకర్ రవికి ప్రియాంక సింగ్, ప్రియ, సిరిల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. బిగ్ బాస్ తర్వాత కూడా వీళ్లంతా తరచూ కులుస్తుండటం, పార్టీలు చేసుకోవడం చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మాత్రం యాంకర్ రవి ప్రియకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే.. బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ సన్నీకి కాల్ చేసి ఒక రూ.15 వేలు తనకు పంపాలంటూ అడగమని చెప్పాడు.
ప్రియ కూడా ఫోన్ తీసుకుని సన్నీకి కాల్ చేసి కొంచం అవసరం ఉంది ఒక రూ.15 వేలు పంపవా అని అడిగింది. సన్నీ వెంటనే 15 వేలు ప్రియకు పంపాడు. ఇక్కడ ప్రియనే ఎందుకు అడగమని కోరాడు అంటే.. బిగ్ బాస్ హౌస్ లో వీజే సన్నీకి ప్రియకు అసలు పడేది కాదు. వారి మధ్య పెద్ద యూద్ధాలే జరిగాయి. అది దృష్టిలో ఉంచుకొనే యాంకర్ రవి ప్రియను అలా అడగమని చెప్పినట్లు ఉన్నాడు. సన్నీ మాత్రం ప్రియ అడగగానే డబ్బు పంపించడంతో.. అది మా సన్నీ అంటూ ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.