బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఓటిటి షో అంటే జనాలు పట్టించుకోలేదు. కానీ.. టీవీ సీజన్స్ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. గతేడాది బిగ్ బాస్ సీజన్ 6 ముగియడంతో ఇప్పుడు సీజన్ 7 గురించి చర్చలు మొదలైపోయాయి. కొత్త సీజన్ గురించి ఇంకా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఏమి స్పందించలేదు. అంతలోనే ఈసారి బిగ్ బాస్ లో పాల్గొనబోయేది వీరేనంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా వచ్చే బిగ్ బాస్ 7లో యాంకర్ రష్మీ గౌతమ్ పాల్గొనబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ వార్తలపై తాజాగా రష్మీ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బిగ్ బాస్ షో.. సీజన్ 7లోకి ఎంటర్ అవ్వబోతుంది. మొదటి రెండు సీజన్స్ తప్ప మిగతా సీజన్స్ అన్నీ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సీజన్ 7పై అందరిలో ఆసక్తి మొదలైంది. ఇప్పటినుండే ఎవరెవరు రానున్నారు? ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అని ఆరా తీస్తూ.. యాంకర్ రష్మీ పేరును లేవనెత్తారు నెటిజన్స్. సీజన్ 7లో రష్మీ కన్ఫర్మ్ అని.. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షోకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రష్మీ గ్లామర్ ని క్యాష్ చేసుకుందామని ఆలోచిస్తున్నారని కథనాలు కూడా అల్లేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలు ఆనోటా ఈనోటా పాకి రష్మీ చెవిన పడింది.
ఇక తాజాగా బిగ్ బాస్ రూమర్స్ పై యాంకర్ రష్మీ ఇన్ స్టాగ్రామ్ లో రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ సీజన్ 7లో లేనని.. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేస్తూ తన స్టేటస్ లో పోస్ట్ పెట్టింది రష్మీ. ప్రస్తుతం రష్మీ పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. ఈసారి కూడా రష్మీ లేదా అని ఆమె ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. కాగా.. యాంకర్ రష్మీ ఓవైపు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని హోస్ట్ చేస్తూనే.. సినీ కెరీర్ పై ఫోకస్ పెడుతోంది. కెరీర్ పీక్స్ లో ఉన్న ఈ టైమ్ లో రష్మీ బిగ్ బాస్ లో పాల్గొనడం అనేది కాస్త కష్టమైన నిర్ణయమే అని అంటున్నాయి బుల్లితెర వర్గాలు. మరి బిగ్ బాస్ లోకి రష్మీ వస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.