అందాల నటి, యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇక తాజాగా మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది అనసూయం. ఆ వివరాలు..
యాంకర్‌గా, నటిగా విభిన్న రంగాల్లో రాణించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఇక కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది అనసూయ. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంతలా ట్రోల్ చేసినా.. భయపడదు.. వెనకడుగు వేయదు. పైగా తనను కామెంట్స్ చేసేవాళ్లకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. వాళ్ల నోరు మూయిస్తుంది. హాట్ ఫోటోలతో పాటు.. హాట్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో అగ్గి రాజేసింది అనసూయ. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో తన ఫోటోలు, ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకునే అనసూయ.. అప్పుడప్పుడు నెటిజన్స్‌తో అస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించి.. నెటజనులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటుంది. ఇక తాజాగా అనసూయ.. సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించిది. ఈ క్రమంలో ఓ నెటిజన్ అనసూయను ఇరుకున పెట్టే ప్రశ్న సంధించాడు. మీరు నిజంగా మెచ్యుర్డ్, లిబరల్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు లెస్పియన్స్‌తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అని అనసూయను సూటిగా ప్రశ్నించాడు
సాధారణంగా ఇలాంటి ప్రశ్న చూడగానే సెలబ్రిటీలు కాస్త చిరాకు పడతారు. బుద్ది ఉందా అని ప్రశ్నిస్తారు. కానీ అక్కడ ఉంది అనసూయ. అందుకే ఎంతో ధైర్యంగా, బోల్డ్‌గా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ‘మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లో చాలా మంది గే లున్నారు. అయితే పర్సనల్‌గా నాకు లెస్బియన్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కాలేదు. కానీ ఆన్ లైన్‌లో మాత్రం చాలా సార్లు ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నాను’ అని ఎంతో ధైర్యంగా, ఒపెన్‌గా ఆన్సర్ చెప్పింది అనసూయ.
ఈ సమాధానం చూసి నెటిజనులు షాకవుతున్నారు. ఇంత ఒపెన్‌గా ఆన్సర్ చేసింది ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి కొన్ని విషయాలపై కామెంట్ చేస్తే.. నెటిజనుల మీద ఓ రేంజ్‌లో ఫైరవుతుంది అనసూయ. మరీ ముఖ్యంగా కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోదు. అలాంటిది.. ఈప్రశ్నకు ఇంత కూల్‌గా ఆన్సర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి అనసూయ కామెంట్స్‌పై మీ రియాక్షన్ ఏంటి కామెంట్ చేయండి.