ఇండస్ట్రీలో నటీనటులకు సంబంధించి పోలీసు కేసులు, అరెస్టుల గురించి వార్తలు వినిపిస్తే ఫ్యాన్స్ కంగారు పడిపోతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఫ్యాన్స్ అలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే.. రాఖీ సావంత్ ని ముంబైలోని అంబోలి ఏరియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి రాఖీ సావంత్ ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏకంగా ఆమెను పోలీస్ స్టేషన్ కి తరలించేంత కేసు ఏం నమోదైంది? అని ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఖీ అరెస్ట్ వెనుక మరో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షెర్లిన్ చోప్రా పేరు వెలుగులోకి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. నటి షెర్లిన్ చోప్రా, అంబోలి పోలీస్ స్టేషన్ లో రాఖీ సావంత్ పై కేసు ఫైల్ చేసింది. తనకు సంబంధించి పర్సనల్ ఫోటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసిందంటూ తాజాగా అంబోలి స్టేషన్ లో ఫిర్యాదు చేసింది షెర్లిన్. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జనవరి 19న మధ్యాహ్నం రాఖీని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఈ విషయాన్నీ కేసు పెట్టిన షెర్లిన్ చోప్రానే ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి మరీ ప్రకటించడం గమనార్హం. జనవరి 19న ఓ డాన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి వెళ్తున్న రాఖీని ఆపి.. పోలీసులు అరెస్ట్ చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో షెర్లిన్ ట్వీట్ చేస్తూ.. “అంబోలి పోలీసులు FIR 883/2022 పై రాఖీ సావంత్ ను అరెస్టు చేశారు. జనవరి 18న రాఖీ సావంత్ పెట్టిన ABA 1870/2022 పిటిషన్ ని ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది” అని చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. గతేడాది మీటూ(#MeToo) కేసులో అరెస్ట్ అయిన సాజిద్ ఖాన్ పై పలు వివాదాస్పద ఆరోపణలు చేసింది షెర్లిన్. సాజిద్ ఖాన్ పై ఆరోపణలు చేయడంతో షెర్లిన్ పై రాఖీ సావంత్ ఫైర్ అయ్యింది. అక్టోబర్ 29న సాజిద్ ఖాన్ కి తన స్టేట్ మెంట్ రికార్డు చేసిన షెర్లిన్.. అతన్ని సల్మాన్ ఖాన్ కాపాడుతున్నారని ఆరోపించింది. షెర్లిన్ ప్రకటనపై ఫైర్ అయిన రాఖీ సావంత్.. ఏ ఫిర్యాదులో ఎంత నిజం ఉందనేది పోలీసులకు తెలుసంటూ మీడియా ముందు సాజిద్ ని సమర్థిస్తూ వచ్చింది. అదే టైంలో రాఖీ సావంత్ పై షెర్లిన్ చోప్రా పరువు నష్టం ఆరోపణలతో కేసు ఫైల్ చేసింది. ఇక ఇటీవలే రాఖీ సావంత్ తన ప్రియుడు ఆదిల్ దురానిని పెళ్లాడింది. ఇంతలోనే ఈ అరెస్ట్ విషయం సినీ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. మరి రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రాల విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
BREAKING NEWS!!!
AMBOLI POLICE HAS ARRESTED RAKHI SAWANT IN RESPECT WITH FIR 883/2022
YESTERDAY, RAKHI SAWANT’S ABA 1870/2022 WAS REJECTED BY MUMBAI SESSIONS COURT
— Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) January 19, 2023
Take a look at what Sherlyn Chopra has to say about Rakhi Sawant’s arrest at Amboli Police Station.
.
.
.
.#SherlynChopra #RakhiSawant #Arrest #mumbai #news #bollywood #RadioCity pic.twitter.com/nt7sB2Bdt0— Radio City (@radiocityindia) January 19, 2023
According to India Today, Sawant was arrested by the Amboli police on Thursday. Chopra had registered a complaint against the dancer over alleged defamation in November.#36Tnews #BiggBoss16 #BIGBOSS16 #RakhiSawant#bollywoodactress pic.twitter.com/AQNvLvaJcg
— 36T News (@36tNews) January 19, 2023