మూగజీవాలకు ఏ చిన్న హానీ కలిగినా వెంటనే స్పందిస్తుంది యాంకర్ రష్మీ. అయితే తాజాగా అంబర్‌పేట వీధి కుక్కల ఘటన తర్వాత రష్మీపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌కి రష్మీ ఒపెన్ చాలెంజ్ చేసింది. ఆ వివరాలు..
అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ దారుణంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది అంటూ ప్రజలు మండి పడుతున్నారు. ప్రస్తుతం నగరంలో వీధి కుక్కల సమస్యపై అధికారులు ఫోకస్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రదీప్ సంఘటన తర్వాత చాలా మంది నెటిజనులు మూగ జీవాల పట్ల ప్రేమ చూపాలంటూ ప్రచారం చేసే సెలబ్రిటీల మీద విరుచుకుపడుతున్నారు. మీ దృష్టిలో జంతువులు ముఖ్యమా ఓ పసివాడి ప్రాణం ముఖ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌కి, యాంకర్ రష్మీకి మధ్య ట్విట్టర్‌లో వార్ నడిచింది. సదరు నెటిజన్‌కి రష్మీ ఒపెన్ సవాల్ విసిరింది. నీ అడ్రెస్ చెప్పు అక్కడికే వచ్చి తేల్చుకుంటాను అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
అంబర్‌పేట ఘనటపై స్పందిస్తూ ఓ ట్విట్టర్ యూజర్.. యాంకర్ రష్మీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ రష్మీ కుక్క.. తనని కుక్కను కొట్టినట్లు కొట్టాలి అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై రష్మీ రియాక్ట్ అవుతూ.. సదరు నెటిజన్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘తప్పకుండా.. నీ అడ్రెస్ చెప్పు.. నేను వ్యక్తిగతంగా వచ్చి నిన్ను కలుస్తాను. ఎలా కొడతావో నేను చూస్తాను.. నీకిదే నా చాలెంజ్’’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరలవుతున్నాయి.
Sure
Pls share your address I’ll come personally
Let’s see how you can handle the situation then
It’s an open challenge https://t.co/SMhAIhWWY4— rashmi gautam (@rashmigautam27) February 24, 2023
ఇక అంబర్‌పేట ఘటనపై రష్మీ కూడా స్పందించింది. కుక్కలు షెల్టర్ ఏర్పాటు చేయమన్నది. దాంతో నెటిజనులు రష్మిపై విరుచుకుపడ్డారు. ఓ పసివాడి ప్రాణం పోయింది. అది నీకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఇక అంబర్‌పేట ఘటనపై రామ్ గోపాల్ వర్మ కాస్త ఘాటుగా స్పందించాడు. ఏకంగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక నగరంలో కుక్కల బెడదను తప్పించడానికి జీహెచ్‌ఎంసీ యంత్రాంగం రంగంలోకి దిగంది. మరో వైపు టీఆర్‌ఎస్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. మరి రష్మీ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.