సెలబ్రిటీల పిల్లలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. తండ్రి లేదా తల్లితో కలిసి తెగ సందడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కొడుకు, కూతురు అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. బన్నీ కూతురు అర్హ అయితే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియోలనీ అల్లు అర్జున్, అతడి భార్య స్నేహ పలు సందర్భాల్లో ఇన్ స్టాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో కూడా పంచుకున్నారు. కానీ స్నేహ ఇప్పుడు కొడుకుతో తీసుకున్న మరో ఫొటోను స్టోరీలో పెట్టుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక అతడి భార్య కూడా ఎప్పటికప్పుడు నెటిజన్లను పలకరిస్తూనే ఉంటుంది. బన్నీతో కావొచ్చు, తన పిల్లలతో కావొచ్చు. తీసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన కొడుకు అయాన్ తో కలిసి వంట చేస్తున్న వీడియోని ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.
ఇకపోతే అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఇప్పటికే సమంత లీడ్ రోల్ లో చేసిన ‘శాకుంతలం’లో నటించింది. త్వరలో ప్రారంభమయ్యే మహేశ్ బాబు సినిమాలోనూ యాక్ట్ చేయనుందని అంటున్నారు. మరోవైపు బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా నటిగా పరిచయం కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియదు. ఏదేమైనా బన్నీ మాత్రం ‘పుష్ప’ మూవీతో రాబోయే కొన్నేళ్లకు సరిపడా క్రేజ్ ని సంపాదించేశాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. బన్నీ కొడుక్కి స్నేహారెడ్డి వంట నేర్పడం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.