ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తోంది. ఈ సీన్ థియేటర్లు దద్దరిల్లే సీన్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పరాజ్ ఇలా అవతారం ఎత్తడానికి వెనక ఓ కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఏకైక పేరు పుష్ప. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప2 సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఓ రేంజ్ లో ఉన్న ఈ టీజర్ చూస్తూ.. ఉంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. టీజర్ లో ముఖ్యంగా ప్రేక్షకులకు ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నను వదిలేశాడు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూ.. దూసుకెళ్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పునకాలు తెప్పిస్తోంది. ఈ సీన్ థియేటర్లు దద్దరిల్లే సీన్ అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే పుష్పరాజ్ ఇలా అవతారం ఎత్తడానికి వెనక ఓ కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప2.. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా పాన్ ఇండియా లెవల్లో చర్చించుకుంటున్న మూవీ. డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక పుష్ప పార్ట్ 1 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానులు ఎదురుచూపులకు తెరదించుతూ.. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప2 టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప ఎక్కడ? అనే ఇంటెన్స్ కాన్సెప్ట్ ను జనాల్లో క్రియేట్ చేశాడు సుకుమార్. ఇక ఇదంత కొద్దిసేపు పక్కన పెడితే.. తాజాగా అల్లు అర్జున్ పుష్ప2 కు సంబంధించిన ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో బన్నీ తీరు పునాకాలు తెప్పించక మానదు.
ఈ ఫోటోలో చీర కట్టులో అమ్మవారు ఉన్నట్లు మెడలో నిమ్మకాయల దండతో.. భయంకరంగా కనిపించాడు బన్నీ. ఓ ఫైట్ సీన్ లో భాగంగా.. పుష్ప రాజ్ ఇలా సిద్దం అయ్యాడని తెలుస్తోంది. ఇక బన్నీ ఇలా శివ-పార్వతులు కలిసి ఉన్నట్లుగా రడీ అవ్వడం వెనక ఓ పెద్ద కథే ఉంది. అదేంటంటే? ప్రతీ సంవత్సరం తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఇక ఈ జతరలో పురుషులు.. మహిళల లాగా ముస్తాబు కావడం అనే ఆచారం తరతరాలుగా అక్కడ వస్తోంది. అందులో భాగంగానే బన్నీ సగం శివునిలా, సగం పార్వతిలా దర్శనం ఇచ్చాడు. ఇక ఈ గెటప్ లో గుడి దగ్గర జరిగే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ గెటప్ లో ఉన్న ఫోటోను స్వయంగా అల్లు అర్జునే తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. బన్నీని ఊర మాస్ కంటే ఊర మాస్ గా సుకుమార్ చూపించబోతున్నాడు అని అర్ధం అవుతోంది. మరి బన్నీ ఈ లుక్ లో కనిపించడంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.