బన్నీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా తీసి బాలీవుడ్ లో సెటిలైపోయిన మాస్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. పొద్దుపొద్దునే చిన్న సైజ్ షాకిచ్చాడు. ‘పుష్ప 2’ రిలీజ్ కావడానికి ముందే తన కొత్త సినిమాను ప్రకటించాడు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అంచనాలు అప్పుడే పెంచేసుకుంటున్నారు. ఎందుకుంటే ‘పుష్ప’తో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దీని సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ వేస్తూ తన కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా బన్నీ డ్యాన్సులకు తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఫిదా అయిపోయేవారు. ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అప్పుడు పాటలు, రీల్స్ ఎంత హడావుడి జరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ తర్వాత 2021 డిసెంబరులో ‘పుష్ప’గా వచ్చాడు. తెలుగులో మాత్రం ఈ సినిమా రిలీజ్ అని ముందు అనుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ రిలీజ్ చేశారు. దీంతో నార్త్ ఆడియెన్స్ ఊగిపోయారు. వందల కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు.
దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త గ్లోబల్ స్టార్ బన్నీ అయిపోయాడు. సుకుమార్ డైరెక్షన్ లోనే ‘పుష్ప 2’ చేస్తున్న ఇతడు.. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్టు ఓకే చేశాడు. బన్నీ బాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. హిందీలో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన టీ సిరీస్.. బన్నీ-సందీప్ రెడ్డి ప్రాజెక్టుని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’ దాని హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తానేంటో ప్రూవ్ చేసుకున్న సందీప్.. ప్రస్తుతం ‘యానిమల్’ తీస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని లైన్ లో పెట్టాడు. మరి ప్రభాస్-బన్నీ సినిమాల్లో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. మరి సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా చేయనుండటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
Brace yourselves for this massive collaboration between three powerhouses of India – Producer Bhushan Kumar, Director Sandeep Reddy Vanga and superstar Allu Arjun.@alluarjun @imvangasandeep #BhushanKumar #KrishanKumar @VangaPranay @VangaPictures #ShivChanana @NeerajKalyan_24 pic.twitter.com/xis8mWSGhl
— T-Series (@TSeries) March 3, 2023