ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయమిది. టాలీవుడ్ నుండి ఒక్కొక్కరుగా పాన్ ఇండియా స్టార్స్ అవుతూ తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు డార్లింగ్ ప్రభాస్.. అక్కడి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న మరో తెలుగు స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గతేడాది చివరిలో విడుదలై మంచి విజయం సాధించింది.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ – సుకుమార్ తో పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ పుష్పరాజ్ క్యారెక్టర్, మేనరిజంతో అల్లు అర్జున్.. సోషల్ మీడియా ద్వారా పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ క్రేజీ న్యూస్ సినీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడు.ఆ సినిమా తర్వాత రాజమౌళి.. అల్లు అర్జున్ తో చేయనున్నట్లు సమాచారం. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ దర్శకులు వేణు శ్రీరామ్, బోయపాటి శ్రీను, సంజయ్ లీలా భన్సాలీ లతో ఒక్కో సినిమా చేయనున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరిప్పుడు ఆ లైన్ లో రాజమౌళి చేరాడని, త్వరలోనే వీరి కాంబినేషన్ పై క్లారిటీ రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళితో అల్లు అర్జున్ సినిమా అని వార్త తెలిసే సరికి ఫ్యాన్స్ ఓ రేంజిలో ఖుషి అవుతున్నారు. మరి ఈ కాంబోలో ఎలాంటి సినిమా రానుందో చూడాలి. ఇక రాజమౌళి – బన్నీ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.