ఈ మద్య దక్షిణాది చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ లో మాత్రమే వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన రికార్డు ఉండేవి. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి 2 ఆ రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో దక్షిణాది నుంచి వస్తున్న చిత్రాలు వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఇక దక్షిణాది చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పటివరకు వచ్చిన మల్టీస్టారర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మల్టీస్టారర్ చిత్రాల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ డైరెక్టర్, నటుడు, నిర్మాత కరణ్ జోహార్ కి సంబంధించిన ఓ షోలో మాట్లాడిన అక్షయ్ కుమార్.. మల్టీస్టారర్ చిత్రాల గురించి స్పందించాడు. ఇటీవల ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ నటినటుల జాబితాలో బాలీవుడ్ నుంచి అక్షయ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఈ విషయం గురించి ప్రస్థావించిన కరణ్ జోహార్ కి అక్షయ్ బదులిస్తూ.. నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణమన్నారు. సాధారణంగా హిందీ నటీనటులు ఇద్దరు హీరోల సినిమాలు చేయాలంటే భయపడతారు. ఇక్కడ సింగిల్ హీరో సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
ఒకప్పుడు మల్టీస్టారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఉన్నా.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. ఇక్కడ మల్టీస్టారర్ చిత్రాలను చేసేందుకు హీరోలలో అభద్రతా భావం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టుకోవాలని అన్నారు. తనకు మల్టీస్టారర్ చిత్రం లో నటించడానికి ఏమాత్రం ఇబ్బంది లేదని అన్నారు. కరణ్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరో కావాలని.. కానీ ఇప్పటివరకు హీరోను పొందలేకపోయామన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.