ఆ హీరోయిన్.. ఓ హీరోతో రిలేషన్ లో ఉంది. ఈ విషయం ఫ్యాన్స్ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏకంగా బాయ్ ఫ్రెండ్ బట్టల్లేని ఫొటోని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడీ విషయం కాస్త హాట్ టాపిక్ అయిపోయింది.
టైటిల్ చూసి ఇదేదో ఫేక్ న్యూస్ అనుకుని మమ్మల్ని తిట్టుకుంటున్నారేమో? జస్ట్ వెయిట్. ఓ రెండు మూడు నిమిషాలు ఆగి, ఈ స్టోరీ పూర్తి చదివండి. ఆ తర్వాత మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరా హీరోయిన్, ఎందుకు తన బాయ్ ఫ్రెండ్ న్యూ*డ్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిందా అని మీరు కచ్చితంగా అనుకుంటారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీళ్ల లవ్ స్టోరీనే కాస్త డిఫరెంట్. తాజాగా పెట్టిన ఫొటో వీళ్ల రిలేషన్ షిప్ కి పరాకాష్ట అనుకోవచ్చు. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. గత కొన్నాళ్ల నుంచి ఎక్కువ వయసున్న వారితో రిలేషన్షిప్లో ఉండటం సరికొత్త ట్రెండ్ అయిపోయింది. మాములు ప్రజల గురించి పక్కనబెడితే యాక్టర్స్ విషయంలో ఇది కాస్త ఎక్కువ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ గా బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాని చూపించొచ్చు. 49 ఏళ్లు ఈ ముదురు ముద్దుగుమ్మ.. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైనా హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. పెళ్లి చేసుకోలేదు కానీ గత కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారని మూవీ న్యూస్ చదివేవారికి తెలుసు.
ఎప్పటికప్పుడు వెకేషన్స్, జిమ్ వర్కౌట్ పిక్స్ లాంటివి పోస్ట్ చేస్తూ ఉండే మలైకా అరోరా.. ఈసారి కాస్త శ్రుతిమించే పనిచేసింది. ఏకంగా అర్జున్ కపూర్ బట్టల్లేకుండా, కేవలం తలగడ(పిల్లో) మాత్రమే తన బాడీకి అడ్డుపెట్టుకుని ఉన్నాడు. ఈ పిక్ ని మలైకా ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసి.. ‘నా సొంతమైన నా లేజీ బాయ్’ అని రాసుకొచ్చింది. నార్మల్ గా పిక్స్ పెడితే పర్వాలేదు గానీ మరి బరితెగించి అలా నగ్నంగా ఉన్న ఫొటోలు పెట్టినందుకు నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. కామెంట్స్ తో మలైకాని ఏకిపారేస్తున్నారు. మరీ ఇలా బెడ్ రూమ్ ఫొటోలని మలైకా బయటపెట్టడం ఏంటని తిట్టుకుంటున్నారు. ఈ ఫొటోలపై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్ చేయండి.