బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించి వ్యక్తి ఫొటోని ఏకంగా సల్మాన్ పోస్ట్ చేశాడు.
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం! అవును మీరు విన్నది నిజమే. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ ఈ మధ్యే.. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. హిందీలో ఓ మాదిరిగా ఆడింది కానీ మిగతాచోట్ల ఫెయిలైంది. ఇలా ఫ్యాన్స్ సినిమా గురించి ఆలోచిస్తూ ఉండగా.. తనని పెంచి పెద్ద చేసిన ఆమె చనిపోయిందని సల్మాన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఎవరామె? ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సల్మాన్ ఖాన్ గురించి సినిమా ప్రేక్షకులకు తెలుసు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మార్క్ మూవీస్ తో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. అలానే సల్మాన్ ఫ్యామిలీ గురించి ఫ్యాన్స్ తోపాటు చాలామందికి తెలుసు. అలాంటిది తాజాగా అద్దు అని సంభోదిస్తూ, ఆమె చనిపోయిందని, రెస్ట్ ఇన్ పీస్ అని ఇన్ స్టాలో సల్మాన్ ఆమె ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో అసలు ఈమె ఎవరా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కొందరేమో సల్మాన్ చిన్నతనంలోని కేర్ టేకర్ ఈమె అని మాట్లాడుకుంటున్నారు. అద్దు ఆంటీ ఎవరనేది సల్మాన్ చెప్పాల్సి ఉంది.