మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలో అక్కినేని హీరో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.
ఒకప్పుడు సినిమా అంటే హీరోకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఉండేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. డిఫరెంట్ డిఫరెంట్ కథలతో మూవీస్ తీస్తున్నారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్స్ పుట్టుకొస్తున్నాయి. యంగ్, సీనియర్ హీరోలు.. ఇతర కథానాయకుల చిత్రాల్లో నటిస్తున్నారు. సదరు సినిమాలపై అంచనాలని పెంచేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చిరంజీవి ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా అక్కినేని హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ జోష్ మీదున్నారు. ‘ఖైదీ నం. 150’ హిట్ కొట్టి గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ‘సైరా’, ‘ఆచార్య’తో బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. అయితేనేం బంతిని వెంటనే బౌన్స్ అయ్యారు. ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో మళ్లీ హిట్స్ కొట్టారు. ‘ఆచార్య’లో కొడుకు చరణ్ తో నటించిన చిరు.. ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘వీరయ్య’లో రవితేజతో కలిసి రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘భోళా శంకర్’లోనూ మరో యంగ్ హీరోతో కలిసి నటిస్తున్నారు.
‘వేదాళం’ రీమేక్ అయిన ‘భోళా శంకర్’ సినిమాని అన్నాచెల్లెలు సెంటిమెంట్ ఆధారంగా తీస్తున్నారు. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోయిన్ గా తమన్నా చేస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలనే అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడని రివీల్ చేశారు. శనివారం అతడి పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ విషెస్ చెప్పారు. దీనిపై స్పందించిన సుశాంత్.. ‘మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అని రీట్వీట్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ‘అల వైకుంఠపురములో’ తర్వాత సుశాంత్ పలు సినిమాల్లో డిఫరెంట్స్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. రవితేజ ‘రావణాసుర’లో విలన్ గా నటిస్తుండటం విశేషం. మరి చిరు-సుశాంత్ కాంబో ఎలా ఉండబోతుందని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Its a privilege & an honour to share screen with the one & only MegaStar @KChiruTweets Sir!😀🙏A fan boy moment I’ll cherish for life!❤️
Thank You @MeherRamesh Sir @AnilSunkara1 Sir @AKentsOfficial @kishore_Atv garu &team!🤗
The stunners@KeerthyOfficial @tamannaahspeaks & team💐 https://t.co/o2afJechAW— Sushanth A (@iamSushanthA) March 18, 2023