నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సక్సెస్ మీట్ లో భాగంగా ఆయన అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి మాట్లాడుతూ నోరు జారడం వివాదానికి దారి తీసింది. ఎన్టీఆర్ ని పొగిడే క్రమంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులను తక్కువ చేసి మాట్లాడడంపై సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అక్కినేని తొక్కినేని రింగారావు’ అంటూ మాట్లాడడంపై బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు.
ఇక బాలకృష్ణ నోరు జారడంపై అక్కినేని హీరోలు స్పందించారు. నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ.. వినయంగా బాలకృష్ణ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు ఈ ముగ్గురూ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని, వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరచుకోవడం అని ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇక బాలకృష్ణ తీరుపై అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మహానటులపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని, ఆయన మాటలు తెలుగు సినీ పరిశ్రమను అవమానించినట్టే అవుతుందని ఫ్యాన్స్ పేర్కొన్నారు.
తక్షణమే బాలయ్య క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ చేసింది. ఇటీవలే దేవ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. దేవాంగులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో.. బాలకృష్ణ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ వేదికగా బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. మరి ఏఎన్నార్ విషయంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతారా? లేదా? అనేది చూడాలి. అక్కినేని ఫ్యాన్స్ క్షమాపణలు డిమాండ్ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.