ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీపై సినీ అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ ఆటిట్యూడ్, యాక్షన్ కి తోడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాసివ్ టేకింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది.
ఇక ఇప్పుడప్పుడే కేజీఎఫ్ మేనియా తగ్గేలా లేదు. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు రాకీ భాయ్ మేనరిజం చూసి షాక్ అవుతున్నారు. అసలు ప్రశాంత్ నీల్ చూపించిన ఎలివేషన్స్ కి మాస్, క్లాస్ ఆడియెన్స్ అంతా థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ కేజీఎఫ్-2 మూవీ చూసి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు.
“కేజీఎఫ్-2లో హీరోయిజం, ఎలివేషన్స్.. ప్రతిదీ హై లెవెల్ లో ఉన్నాయి. సినిమా చూసిన వారందరికి హై ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కల్ట్ ఫిలిం అందించినందుకు చిత్రబృందానికి అభినందనలు. రాకీభాయ్ గా యష్ అదరగొట్టాడు. ప్రశాంత్ నీల్ విజన్ మాములుగా లేదు. ఇది ప్యూర్ మ్యాజిక్. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో మ్యాజిక్‌ను క్రియేట్ చేసినందుకు టెక్నీషియన్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు” అంటూ అఖిల్ కేజీఎఫ్ పై తన ఫీలింగ్ చెప్పుకొచ్చాడు. మరి కేజీఎఫ్2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.