ఈ ఏడాది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను వారి ఫ్యాన్స్ అంతా కలిసి 4కే వెర్షన్ ప్రింట్ తో రీ రిలీజ్ లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాల నుండి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ప్రభాస్ బిల్లా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, ఎన్టీఆర్ బాద్షా సినిమాలను వారి బర్త్ డేస్ సందర్భంగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేసుకొని పండగ చేసుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ ఆల్ టైమ్ సూపర్ హిట్స్ లో ఒకటైన ‘ఖుషి’ సినిమాని రీ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో రిలీజ్ చేసిన ఈ సినిమాకి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బుకింగ్స్ నమోదయ్యాయి.
ఈ క్రమంలో తాజాగా ఖుషి సినిమా 4కే ప్రింట్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ తో పాటు పవన్ తనయుడు మూవీ చూడటం విశేషం. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న మోస్ట్ పాపులర్ థియేటర్ ‘దేవి 70ఎంఎం’ స్క్రీన్ లో పవన్ కుమారుడు అకిరా నందన్ ఖుషి సినిమాని చూసి ఎంజాయ్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ కేరింతల మధ్య అకిరా తండ్రి సినిమాని చూస్తూ మురిసిపోయాడు. అలాగే ఫ్యాన్స్ మధ్య తన తండ్రి సినిమా చూడటంతో చాలా ఎక్సయిట్ అయినట్లు తెలుస్తోంది. అయితే.. ఖుషి సినిమాని అకిరా నందన్ ఫుల్లుగా తన ఫేస్ కవర్ చేసి చూడటం గమనార్హం. అంటే.. అభిమానుల కేరింతలు, అరుపుల మధ్య అకిరా కనిపిస్తే వాతావరణం వేరేలా ఉంటుందని భావించి ఉంటారు.
ఇక ఖుషి సినిమాని ఎంజాయ్ చేసిన అకిరా నందన్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. చాలామంది ఫ్యాన్స్ అకిరా థియేటర్ కి వచ్చి సినిమా చూడటం, వెళ్లిపోవడం లాంటి సన్నివేశాలన్నీ మొబైల్స్ లో రికార్డు చేశారు. ప్రస్తుతం అకిరా ఖుషి సినిమా చూసిన విజువల్స్ ఫ్యాన్స్ కి మరింత కిక్కిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీ అయిన విషయం విదితమే. ఈ ఏడాది భీమ్లా నాయక్ తర్వాత హరిహర వీరమల్లు, వినోదయ సితం తమిళ రీమేక్, హరీష్ శంకర్ తో ఓ సినిమా లైనప్ చేశాడు. చూడాలి మరి ముందుగా ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందో. అయితే.. ప్రస్తుతం ఖుషి రీ రిలీజ్ కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#AkiraNandan watched #Kushi at Devi 70 MM#KushiReReleaseOnDec31St #KushiReRelease #Kushi4K #KushiManiaBegins #KushiDay pic.twitter.com/iDvCjoDNVD
— Pawan Kalyan Fans (@Pawan_KalyanFC) December 31, 2022
#Akira watching #Kushi 🔥🔥🔥🔥🔥♥️@PawanKalyan #KushiRampageBegins #KushiReRelease at Devi 70mm pic.twitter.com/cOXuRf4kra
— Akhil Eppalapally (@akhilimz) December 31, 2022