అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ కెరీర్ లో సెట్ అవ్వడానికి అన్నీ విధాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సున్నితమైన లవ్ స్టోరీకి భావోద్వేగమైన సన్నివేశాలను యాడ్ చేసి, బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించాడు. విడుదలైన మొదటిరోజే ఈ చిత్రం ప్రశంసలు అందుకోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని వేగవంతం చేసింది. ఈ ఈవెంట్ లో అఖిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“అల్లు అరవింద్ గారు ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ.., అది లవ్ స్టోరీ అని తెలియడంతో కాస్త డిజప్పాయింట్ అయ్యాను. బొమ్మరిల్లు భాస్కర్ ఎంటర్ అయ్యాక సినిమా స్థాయే మారియూపోయింది. ఆయన కథ చెప్పగానే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాను.
ప్రాజెక్ట్ మొదలుపెట్టే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ కు హిట్లు లేవని తాను అనుకోలేదని, నేనేం బ్లాక్ బస్టర్ ఇచ్చి రాలేదు కదా” అంటూ అఖిల్ ఓపెన్ కామెంట్స్ చేయడం విశేషం. ఏదేమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో అఖిల్ సక్సెస్ ట్రాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.