దేవుడు ఎలా ఉంటాడో తనకు తెలియదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. అయితే తన జీవితంలో ఒక దేవుడు ఉన్నాడని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు కూడా బన్నీని బాగా ఇష్టపడతారు. అతడి సినిమాలతో పాటు ఫ్యాషన్ సెన్స్‌కు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయారు. కొందరైతే బన్నీని దేవుడిలా చూస్తారు. ఆయన మూవీ రిలీజైతే థియేటర్ల దగ్గర పోస్టర్లకు దండలు వేసి, పాలాభిషేకాలు చేస్తారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదన్నారు. కానీ తన లైఫ్‌లో ఒక దేవుడు మాత్రం ఉన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. కంటెస్టెంట్లతో సరదాగా గడిపి వారిలో జోష్ నింపారు బన్నీ. ఈ సందర్భంగా తన లైఫ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఆయన వారితో పంచుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‌లో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరును రివీల్ చేశారు అల్లు అర్జున్. ఆమె పేరు శ్రుతి అని ఆయన తెలిపారు. తన తండ్రి అల్లు అరవింద్ గురించి బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. కానీ నాకు అన్నీ ఇచ్చి.. నాకు కనిపించే దేవుడు మా నాన్నే. ఆయనే నాకు దేవుడు’ అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు బన్నీ. ఇక, ‘పుష్ప’లో కేశవ్‌గా ఆకట్టుకున్న యాక్టర్ జగదీశ్ తన మూవీ ప్రమోషన్ కోసం ఈ ప్రోగ్రామ్‌కు వచ్చారు. అయితే అతడికి అల్లు అర్జున్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘సత్తి గాని రెండెకరాలు’ చిత్రంలో హీరోగా నటించినంత మాత్రాన.. ‘పుష్ప2’లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనంటే కుదరదన్నారు బన్నీ. త్వరగా షూట్‌కు రావాలన్నారు. అలాగే కంటెస్టెంట్లకు ఆయన స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి ప్రోత్సహించారు.