సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఆయన స్టైల్, గ్రేస్, నడక, మాట అన్నీ స్టైల్ కి మారుపేరులా ఉంటాయి. ఆయన వయసు 70 ఏళ్ళు పైబడినా ఇప్పటికి అదే ప్యాషన్ తో హీరోగా సినిమాలు చేస్తున్నారంటే.. అది కేవలం తన అభిమానుల కోసమే. అయితే.. ఏడాదికో సినిమా చేస్తున్నారు కానీ.. రజిని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలాకాలమైంది. ఈ విషయంలో ఫ్యాన్స్ నిరాశగానే ఉన్నారు.
ప్రస్తుతం తలైవా.. తమిళ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకే అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కానుందని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. సూపర్ స్టార్ 169వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆయన సరసన మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ జతకట్టనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాకోసం ఐశ్వర్యను సంప్రదించారని, ఐశ్వర్య కూడా రజిని సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.ఈ విషయం తెలిసి తలైవా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే.. రజిని – ఐశ్వర్య కలిసి ఇదివరకే శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా చేశారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి ఐశ్వర్యతో రజిని కాంబినేషన్ మంచి హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అదీగాక రోబో సినిమాను నిర్మించింది కూడా సన్ పిక్చర్స్ సంస్థనే కావడం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు తలైవా రజినినే కథ అందిస్తున్నట్లు టాక్.
#Thalaivar169 🥳💥 Cast pic.twitter.com/LHl62SDCKb
— THALAIVAR 169 (@rajni_mohan_rfc) June 7, 2022
ఇక ఇటీవలే దర్శకుడు నెల్సన్.. దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేశాడు. ఆ సినిమా కామెడీ యాక్షన్ జానర్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో.. రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్ మోహన్ కీలకపాత్రలు పోషించనున్నారని తెలుస్తుంది. మరి రజిని 169వ సినిమాలో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Thalaivar169 Star Cast
🔸Rajinikanth
🔸Aishwarya Rai Bachchan
🔸Ramya Krishnan
🔸Priyanka MohanDirected by – Nelson
Story by – Rajinikanth
Screenplay – KS Ravikumar
Music – AnirudhA SUN Pictures Productional
Shoot Commence from July
— Box Office Karnataka (@Karnatakaa_BO) June 7, 2022