సినిమా ఇండస్ట్రీలో ఎందరో స్టార్ కపుల్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అది వాళ్ల పర్సనల్ విషయం అయినప్పటికీ కొందరి విడిపోతుంటే అభిమానులే ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. వాళ్లు తిరిగి కలిస్తే బావుంటుందంటూ కోరుకుంటారు. అలాంటి వాళ్లలో ధనుష్– ఐశ్వర్య జంట కూడా తప్పకుండా ఉంటుంది. 18 సంవత్సరాల వారి వైవాహిక జీవితాన్ని ముగిస్తున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వాళ్లు మళ్లీ కలుస్తారంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ఉన్నారు.
ఇదీ చదవండి: శ్రుతిహాసన్ తో తన పెళ్లి జరిగిపోయిందంటూ శంతను కామెంట్స్..
వాళ్లు అలా కోరుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకాలం ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివర ధనుష్ పేరును తొలగించలేదు. కాబట్టి వారి మధ్య బంధం ఇంకా కొనసాగుతోంది.. వాళ్లు మళ్లీ కలుస్తారంటూ సోషల్ మీడియా వేదికల్లో చర్చలు కూడా జరిగాయి. అయితే అలాంటి వాదనలపై ఐశ్వర్య ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో ధనుష్ పేరును తొలగించింది. ఐశ్వర్య రజనీకాంత్ అని మార్చేసింది. అంటే తాము మళ్లీ ఒకటవ్వడం కుదిరేపని కాదని చెప్పకనే చెప్పేసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాకయ్యారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.