పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మాసివ్ చిత్రం ‘భీమ్లా నాయక్‘. గత నెలలో(ఫిబ్రవరి 25న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. ప్రస్తుతం ఓటిటిల ట్రెండ్ నడుస్తుండటంతో.. థియేట్రికల్ రిలీజైన ఏ సినిమా అయినా కొద్దిరోజులకే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో భీమ్లా నాయక్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది.
భీమ్లా నాయక్ ఓటిటి హక్కులను ఆహా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లు దక్కించుకున్నాయి. ఈ రెండింట్లో సినిమా మార్చి 25 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఓటిటి రిలీజ్ సందర్భంగా ఆహా.. భీమ్లా నాయక్ ప్రమోషన్స్ వినూత్నంగా జరుపుతోంది. తాజాగా ఓటిటి ప్రేక్షకుల కోసం ఆహా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 1 వరకు ‘ఆహా’ను ఎవరైతే కొత్తగా సబ్ స్క్రైబ్ చేసుకుంటారో.. వారిలో ఒకరు భీమ్లా నాయక్ బైక్ గెలుచుకునే ఛాన్స్ పొందవచ్చని ప్రకటించింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నడిపిన బైక్.. సబ్ స్క్రైబర్స్ లో ఒకరు ఉచితంగా పొందవచ్చు. ఇది ఆహా కోసం సబ్ స్క్రైబర్స్ ని పెంచుకునే ప్లాన్ అని అందరికీ అనిపించవచ్చు. అయితే.. భీమ్లా నాయక్ కి ఉన్న క్రేజ్ అలాంటిది అంటున్నారు ఫ్యాన్స్. ఇక భీమ్లా నాయక్ బైక్ యాడ్ ని ‘తెలుగు ఇండియన్ ఐడల్’ టీమ్ తమన్, నిత్యామీనన్, సింగర్స్ కార్తీక్, శ్రీరామచంద్ర ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. భీమ్లా నాయక్ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. మరి ఆహాకి సబ్ స్క్రైబ్ కొట్టి, గిఫ్ట్ గా బైక్ పట్టే అవకాశం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#BheemlaNayak lo mana Power Star @PawanKalyan nadipina bandi gelchukune avakasham 😍
All you have to do is subscribe to #ahavideoIN anytime between today to April 1st.
So, what are you waiting for? Go subscribe now!#ahaLaBheemla in 4 days 💥#ahaLaBheemlaOnMarch25 pic.twitter.com/CRbBFNu6DK— ahavideoin (@ahavideoIN) March 21, 2022