టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తనను కాపాడిన వాళ్లకు ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎంతదూరం వెళ్లినా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదీగాక హెల్మెట్ ధరించడం వల్లే తాను బతికానన్నారు.
ఇక రోడ్డు ప్రమాదం నుంచి తనను కాపాడిన వ్యక్తులు, కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే తనను ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్ అబ్దుల్ థ్యాంక్స్.. మానవత్వం ఇంకా బతికి ఉందనడానికి సయ్యద్ అబ్దుల్ నిదర్శనమని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికవర్, అపోలో ఆస్పత్రి సిబ్బంది, వైద్యులకు ధన్యావాదాలు తెలిపారు. ఈ నెల 28న సుకుమార్, బాబీ నిర్మాణంలో తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.