‘బ్రో’ కలెక్షన్ల గురించిన న్యూస్ కూడా మీడియా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పవన్ కెరీర్లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ.. రూ. 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ (ది అవతార్) మూవీ రాకతో తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. రిలీజ్ రోజు కొన్ని చోట్ల వర్షం పడుతున్నప్పటికీ హాళ్ల దగ్గర జన సందోహం కనిపించింది. ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి ఫస్ట్ వీకెండ్ ఏపీ, తెలంగాణలో హౌస్‌ఫుల్స్ పడ్డాయి. ఇన్నాళ్లూ ఫ్యాన్స్, ఆడియన్స్ పవన్ నుండి మిస్ అయిన ఎంటర్టైన్మెంట్, స్టైల్, స్వాగ్, వింటేజ్ లుక్స్.. అలాగే పవర్ స్టార్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్నీ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. మరో వైపు సినిమాలో థర్టీ ఇయర్స్ పృథ్వీ చేసిన శ్యాంబాబు పాత్ర తనను కించపరిచేలా ఉందంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తన వంతు ప్రమోషన్ చేస్తున్నారు.
ఇక ‘బ్రో’ కలెక్షన్ల గురించిన న్యూస్ కూడా మీడియా, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పవన్ కెరీర్లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ.. రూ. 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక మూడవ రోజు రూ. 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి వంద కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. మూడు రోజుల్లోనే రూ.101 కోట్ల 54 లక్షల గ్రాస్ వచ్చింది. ఈ లెక్కన పవన్ కెరీర్లో వంద కోట్లు (త్రీ డేస్) కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ సెట్ చేసింది.
నాలుగో రోజు రూ.6.39 కోట్లు రాగా.. 5వ రోజు కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయంటున్నారు. 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.5.76 కోట్లు తెచ్చింది. దీంతో మొత్తం వసూళ్లు రూ.113.69 కోట్లు అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర మరింత స్ట్రాంగ్ అయితే కానీ బ్రేక్ ఈవెన్ కాదని అంటున్నారు. నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ రీజన్‌బుల్‌గానే క్లోజ్ చేసేశారు. నైజాం : రూ.30 కోట్లు, ఆంధ్ర : రూ. 37.30 కోట్లు, సీడెడ్ : 13.03 కోట్లు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 81 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.97 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది.
ఇది కూడా చదవండి : ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ!.. ఆ స్పెషల్ డే నాడు స్ట్రీమింగ్?